Site icon NTV Telugu

Cricket Match: ప్రాణాలు తీసిన క్రికెట్ మ్యాచ్.. ఓటమిని జీర్ణించుకోలేక ఘాతుకం

Muder

Muder

పిల్లలన్నాక సరాదాగా ఆడుకోవడం.. అల్లరి చేయడం.. జోకులు వేసుకోవడం.. సహజంగా జరుగుతుంటాయి. ఇక ఆటల్లో కూడా ఒకరు గెలవడం.. ఇంకొకరు ఓడిపోవడం కూడా సహజమే. కానీ అదే ఒకరి ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ఒకే గల్లీలో ఉంటూ రోజూ సరాదాగా గడిపే స్నేహితుల మధ్య ఓ పరాజయం రక్తం చిందించేలా చేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan)చోటుచేసుకుంది.

టెన్త్ స్టూడెండ్ సాహు(15), డిగ్రీ విద్యార్థి ముఖేష్ మీనా (20) స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజస్థాన్‌‌లోని మండి పట్టణంలో ఉంటారు. కాలనీ గ్రౌండ్‌లో రోజూ క్రికెట్ ఆడుతుంటారు. అయితే మ్యాచ్ ఓడిపోవడంతో సహును ముఖేష్ మీనా బ్యాట్‌తో తలపై కొట్టాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాహు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సాహు, మీనా ఇద్దరు స్నేహితులని.. కాలనీ గ్రౌండ్‌లో రోజూ క్రికెట్ ఆడతారని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మంగీలాల్ యాదవ్ తెలిపారు. మీనాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

తెలిసీతెలియని వయసులో ఆవేశంతో ఓ యువకుడి చేసిన పనికి కటకటాల పాలయ్యాడు. ఇంకో కుటుంబం బిడ్డను కోల్పోయి దుఖసముద్రంలో మునిగిపోయారు.

Exit mobile version