రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ ముగిసింది. నెక్స్ట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ కోసం ఎదురుచూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మరో వారం రోజుల్లో మొదలవనున్న ఈ సమరం ఎక్కడ జరుగుతుందో, ఏ ఛానల్స్ లో చూడొచ్చో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం…
Read Also: Burnt Alive: కారులో చెలరేగిన మంటలు.. నూతన వధూవరులతో పాటు నలుగురు సజీవదహనం
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రికెట్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు 2021-23 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా రెడీగా ఉంది. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా.. భారత్‌తో పాటు శ్రీలంక కూడా రెండో స్థానం కోసం పోటీ పడ్డాయి. న్యూజిలాండ్ టూర్‌లో ఆడిన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోయింది. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టెస్టు మ్యాచ్‌లో ఐదో రోజు చివరి బంతికి న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.
Read Also: Sajjala Ramakrishna: అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరైంది.. న్యాయం తేలింది
శ్రీలంక ఓటమి నుంచి లాభపడిన భారత్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుంది. WTC ఫైనల్ మ్యాచ్ 2023 జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఈ ఫైనల్ రోజు వర్షం పడితే.. దానికి రిజర్వ్ డే కూడా ఉంది. ఇది 12 జూన్ 2023న నిర్వహించనున్నారు. అయితే భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానుంది. అలాగే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌ను మొబైల్ లో చూడొచ్చు.
