Site icon NTV Telugu

Amitabh Bachchan: ప్లీజ్ అమితాబ్‌ జీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు..

Amitabh Bachchan

Amitabh Bachchan

ప్రస్తుతం ప్రతి ఒక్కరి కోరిక టీమిండియా వరల్డ్ కప్ గెలవడమే.. అయితే, ఇప్పటికే భారత జట్టు అహ్మదాబాద్ లో అడుగుపెట్టింది. దీంతో రేపు నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టుతో భారత్‌ తలపడబోతుంది. ఇక, ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా గెలుపు కోసం ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.

Read Also: Shamshabad: విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. శంషాబాద్‌ నుంచి మరో 4 ఫ్లైట్ సర్వీసులు

అయితే, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మాత్రం ఈ మ్యాచ్‌ చూడటానికి రావొద్దని కొందరు నెటిజన్లు కోరుతున్నారు. అందుకు గల కారణాలు లేకపోలేదు.. రెండు రోజుల క్రితం జరిగిన సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ గెలిచింది. దీనిపై అమితాబ్‌ ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా స్పందిస్తూ.. నేను సెమీ ఫైనల్ మ్యాచ్ చూడకపోతే గెలిచారంటూ ఆయన రాసుకొచ్చారు. ఇంకేముంది.. అసలే సెంటిమెంట్లను జనాలు విపరీతంగా ఫాలో అవుతారు.. ఇక, బిగ్‌బీని ఫైనల్‌ మ్యాచ్ కు రావొద్దంటూ వేడుకుంటున్నారు.

Read Also: Priyanka Gandhi: రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రియాంక గాంధీ పర్యటన

ఇక, అమితాబ్ బచ్చన్ మ్యాచ్‌ చూడకపోతే టీమిండియా విజయం సాధిస్తుందని కొందరు అంటున్నారు. ఈ ఒక్కసారి మాకోసం త్యాగం చేయండి, బిగ్ బీ రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ కు దూరంగా ఉండండి.. లేదంటే మేము మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకుపోయి బంధిస్తామంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అయితే, నెటిజన్స్ కామెంట్స్ చూసిన బిగ్‌బీ.. ఇప్పుడు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు అంటూ మరో నెటిజన్ ట్వీట్‌ చేశాడు. దీంతో అభిమానులు మరింత కంగారుపడుతూ ఆ పని మాత్రం చేయొద్దని దండాలు పెడుతున్నారు. మరి ఫైనల్స్‌కు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ వెళ్తాడా? లేదా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version