NTV Telugu Site icon

T20 World Cup: చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. 15ఏళ్లలో తొలిసారి

Zimbabwe T20 World Cup

Zimbabwe T20 World Cup

T20 World Cup: టీ20 ప్రపంచకప్ లో జింబాబ్వే కొత్త చరిత్ర సృష్టించింది. మెగా టోర్నీ ఆరంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారి సూపర్ 12కు చేరింది. ఈ మధ్య కాలంలో టీం పూర్తిగా పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశ పరుస్తూ వస్తోంది. దీంతో దశాబ్ధన్నర కాలంగా ఆర్థిక సంక్షోభంతో జింబాబ్వే జట్టు కొట్టుమిట్టాడుతోంది. కనీసం క్రికెటర్లకు షూస్, జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలా చూస్తే ఈ వార్త జింబాబ్వే క్రికెట్ లో పునర్ వైభవం సృష్టంగా కనిపిస్తోంది.

టి 20 వరల్డ్ కప్ పోటీల్లో నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 58 (54బంతులు, 6ఫోర్లు) పరుగులతో రాణించి జట్టును విజయ తీరం వైపు నడిపించాడు. హోబార్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మున్షీ-54; మెక్ లియోడ్-25 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో చాతారా, నగరవ చెరో రెండు; ముజారబని, రాజా చెరో వికెట్ పడగొట్టారు.

Read Also: Shruti Haasan: హాలీవుడ్ కు వెళ్తున్న శ్రుతి హాసన్

ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీ కూడా ఆడని జింబాబ్వే ఈసారి మాత్రం చక్కటి ఆటతీరుతో తొలిసారి ప్రపంచకప్ రెండో దశలోకి ప్రవేశించింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ 54 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేయగా, సికందర్ రజా 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Prabhas, Maruthi Movie : ట్రెండ్ మార్చిన ప్రభాస్.. కామెడీ చేస్తున్న రెబల్ స్టార్

ఆరంభ మ్యాచ్‌లో ఆసియా కప్ విజేత శ్రీలంకకు నమీబియా షాక్ ఇవ్వగా, నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. రెండు టీ20 ప్రపంచకప్‌లను ముద్దాడిన విండీస్‌కు ఇది ఊహించని షాకే. కాగా, నిన్న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జింబాబ్వే తొలిసారి టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్‌లోకి ప్రవేశించింది.