NTV Telugu Site icon

Costly Catch: ఒంటి చేత్తో క్యాచ్ పట్టి.. రూ.90 లక్షలు పట్టుకెళ్లిన ప్రేక్షకుడు

Sa20

Sa20

Costly Catch: దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్ మొదలైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మాదిరిగానే దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఈ లీక్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందింది. గడిచిన రెండు సీజన్లలో సన్ రైజర్స్ యాజమాన్యానికి చెందిన టీం విజయం సాధించగా.. ప్రస్తుతం మూడో సీజన్ మొదలైంది. ఈ లీగల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ క్రికెటర్లందరూ వారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మామూలుగా అయితే క్రికెట్ ఆడినందుకు ఆడవాళ్లకు అలాగే సిబ్బందికి మాత్రమే డబ్బులు సంపాదిస్తుంటారు. కాకపోతే కొన్ని టోర్నీలలో ప్రేక్షకులు కూడా డబ్బులు సంపాదించే అవకాశం కల్పిస్తారు. తాజాగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఓ ప్రేక్షకుడిపై కాసుల వర్షం కురిసింది. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ కెన్ విలియంసన్ కొట్టిన సిక్స్ కారణంగా క్రికెట్ ప్రేక్షకుడు లక్షాధికారి అయ్యాడు.

Also Read: Vijayawada: పండగ ఎఫెక్ట్‌.. ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌ కిటకిట..

జనవరి 9 నుండి మొదలైన ఈ లీక్ శుక్రవారం నాడు జరిగిన రెండు మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ డర్బన్ వేదికగా జరగగా మొదట డర్బన్ సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో కెన్ విలయంసన్ అద్భుత హాఫ్ సెంచరీతో మ్యాచ్ ను విజయ తీరాలకు చేర్చాడు. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ కేవలం రెండు పరుగులతో విజయం సాధించింది.

ఇకపోతే మ్యాచ్లో కేన్ విలియంసన్ కొట్టిన భారీ సిక్స్ క్రికెట్ అభిమానిని లక్షాధికారిగా మార్చింది. కెన్ విలియంసన్ కొట్టిన భారీ సిక్స్ బౌండరీ బయటకు వెళ్ళగా.. మ్యాచ్ ను చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు వంటి చేత్తో బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అలా ప్రయత్నములో అతడు విజయం సాధించాడు. ఆ వ్యక్తి అద్భుతమైన స్టైల్ లో క్యాచ్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ క్యాచ్ పట్టడంతో అతడి ఆనందానికి అవధులు లేవు. అంతేకాదు.. అతని పక్కనే ఉన్న మిగతా కొందరు అభిమానులు కూడా అతనిని అభినందించడం మొదలుపెట్టారు. దీనికి కారణం SA20 లీగ్ లో ప్రేక్షకులు క్యాచ్ పట్టుకుంటే రెండు మిలియన్ ర్యాండ్స్ అంటే దాదాపు భారత కరెన్సీలో 90 లక్షల రూపాయలు ఇస్తారు. దీంతో ఆ వ్యక్తికి 90 లక్షల రూపాయలు రావడంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ లీగ్ లో ఇలాంటి క్యాచ్ రెండవది.

Show comments