Cricket Coach Arrest: లైంగిక వేధింపుల కేసు.. స్టార్ క్రికెటర్ కోచ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Coach Arrest: తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లను లైంగికంగా వేధించిన కేసులో కోచ్ నరేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘంలో ఆఫీసు బేరర్‌గా ఉన్న నరేంద్ర తనపై ఆరోపణలు రావడంతో ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే అతనికి రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. శుక్రవారం డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. టీమిండియా మహిళా క్రికెటర్ స్నేహ్ రాణాకు కోచింగ్ ఇచ్చిన ప్రముఖ క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినందుకు అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. స్నేహ్ రాణాను అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దిన నరేంద్ర షా.. డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
అయితే గత కొంతకాలంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న నరేంద్ర షా.. లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. తన వద్ద శిక్షణ పొందుతున్న మైనర్‌తో సహా ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు అతడిపై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేశారు. ఆడియో లీక్ కావడంతో పరువు పోయిందని భావించిన నరేంద్ర షా.. రెండ్రోజుల క్రితం తన ఇంట్లో పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని నెహ్రూ కాలనీ పోలీసులు తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌గా సస్పెండ్ చేయబడిన నరేంద్ర షా గురువారం రాత్రి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నుండి డిశ్చార్జ్ అయ్యారని, వెంటనే అరెస్టు చేశామని పోలీస్ అధికారి పంకజ్ గైరోలా తెలిపారు.
Also Read
- MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
- Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
Read Also: Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?
ప్రస్తుతం స్నేహ్ రాణాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. నరేంద్ర షాపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. అసొసియేషన్ కో కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, షాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్పర్సన్ ఉషా నేగీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీలకు లేఖ రాశారు.
తాజావార్తలు
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!