Site icon NTV Telugu

Cricket Coach Arrest: లైంగిక వేధింపుల కేసు‌.. స్టార్ క్రికెటర్‌ కోచ్‌ అరెస్ట్

Cricket Coach

Cricket Coach

Cricket Coach Arrest: తన వద్ద శిక్షణ పొందుతున్న ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. యువ క్రికెట‌ర్లను లైంగికంగా వేధించిన కేసులో కోచ్ న‌రేంద్ర షాను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘంలో ఆఫీసు బేర‌ర్‌గా ఉన్న న‌రేంద్ర త‌న‌పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఆత్మహ‌త్యకు ప్రయ‌త్నించాడు. అయితే అత‌నికి రిషికేశ్ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. శుక్రవారం డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేసినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. టీమిండియా మహిళా క్రికెటర్ స్నేహ్ రాణాకు కోచింగ్ ఇచ్చిన ప్రముఖ క్రికెట్ కోచ్ నరేంద్ర షా ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినందుకు అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. స్నేహ్ రాణాను అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దిన నరేంద్ర షా.. డెహ్రాడూన్‌లో క్రికెట్‌ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.

అయితే గత కొంతకాలంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న నరేంద్ర షా.. లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. తన వద్ద శిక్షణ పొందుతున్న మైనర్‌తో సహా ముగ్గురు క్రికెటర్లను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు అతడిపై పోక్సో యాక్ట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేశారు. ఆడియో లీక్ కావడంతో పరువు పోయిందని భావించిన నరేంద్ర షా.. రెండ్రోజుల క్రితం తన ఇంట్లో పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడని నెహ్రూ కాలనీ పోలీసులు తెలిపారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌గా సస్పెండ్ చేయబడిన నరేంద్ర షా గురువారం రాత్రి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నుండి డిశ్చార్జ్ అయ్యారని, వెంటనే అరెస్టు చేశామని పోలీస్ అధికారి పంకజ్ గైరోలా తెలిపారు.

Read Also: Panipuri : ఏంటో ఈ ఆడవాళ్లు.. పానీ పూరి తిననంటే కొట్టి చంపేస్తారా?

ప్రస్తుతం స్నేహ్ రాణాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. నరేంద్ర షాపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. అసొసియేషన్ కో కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, షాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ ఉషా నేగీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీలకు లేఖ రాశారు.

Exit mobile version