NTV Telugu Site icon

Australia Cricket Awards 2024: ప్యాట్ కమిన్స్‌కు కాదు.. మిచెల్ మార్ష్‌కు అలెన్ బోర్డర్ అవార్డు! అవార్డ్స్ లిస్ట్ ఇదే

2024 Cricket Australia Awards

2024 Cricket Australia Awards

Ashleigh Gardner Won Belinda Clark Award in Cricket Australia Awards 2024: గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అవార్డులను అందించింది. ఆస్ట్రేలియా బోర్డు అందించే అత్యుత్తమైన అవార్డ్ అయిన ‘అలెన్ బోర్డర్ మెడల్’ ఆల్‌రౌండర్‌ మిచెల్ మార్ష్‌కు దక్కింది. గతేడాది ఆస్ట్రేలియాకు రెండు ఐసీసీ టైటిళ్లు (ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్) అందించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు బదులు మార్ష్‌కు ఈ అవార్డు దక్కడం విశేషం. మార్ష్‌కు కమిన్స్ కంటే 79 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 233 ఓట్లతో మొదటి అలన్ బోర్డర్ అవార్డును మిచెల్ మార్ష్‌ అందుకున్నాడు. ఈ అవార్డును అందుకున్న రెండో ఆల్‌రౌండర్ మార్ష్‌. 2011లో షేన్ వాట్సన్ ఈ అవార్డును అందుకున్నాడు.

మిచెల్ మార్ష్‌ 2023లో టాప్-ఆర్డర్ బ్యాటర్‌గా రాణించాడు. మూడు ఫార్మాట్‌లలో బంతి, బ్యాట్‌తో రాణించాడు. 2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై కెరీర్‌లో అత్యధికంగా 177 రన్స్ చేశాడు. ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేనప్పుడు ఆస్ట్రేలియా వైట్-బాల్ టీమ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. యాష్లీ గార్డనర్ రెండవ బెలిండా క్లార్క్ అవార్డు అందుకుంది. ఎల్లీస్ పెర్రీ (134 ఓట్లు), అన్నాబెల్ సదర్లాండ్ (106 ఓట్లు) కంటే గార్డనర్ (147 ఓట్లు) ఎక్కువ ఓట్లు సాధించింది. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన షాన్ మార్ష్, మెగ్ లాన్నింగ్, ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్‌లను క్రికెట్ ఆస్ట్రేలియా ఘనంగా సన్మానించింది.

Also Read: Ellyse Perry: ఎల్లీస్ పెర్రీ అందం ముందు హాలీవుడ్ హీరోయిన్స్ కూడా సరిపోరు!

ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ లిస్ట్ (2024 Cricket Australia Awards Full List):
# అలెన్ బోర్డర్ మెడలిస్ట్: మిచెల్ మార్ష్
# బెలిండా క్లాక్ అవార్డ్: అశ్లే గార్డ్‌నర్
# షేన్ వార్న్ పురుషుల టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: నాథన్ లయన్
# పురుషుల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: మిచెల్ మార్ష్
# మహిళల వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎల్లిస్ పెర్రీ
# పురుషుల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: జాసన్ బెహ్రెండార్ఫ్
# మహిళల టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎల్లిస్ పెర్రీ
# పురుషుల డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: కామెరూన్ బెన్‌క్రాఫ్ట్
# మహిళల డొమెస్టిక్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: సోఫీ డే, ఎలిస్ విల్లనీ
# బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: ఫెర్గస్ ఓ నీల్
# బెట్టీ విల్సన్ యంగ్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్: ఎమ్మా డీ బ్రౌఫ్
# కమ్యూనిటీ ఇంపాక్ట్ అవార్డ్: అశ్లే గార్డ్‌నర్
# బీబీఎల్ ప్లేయర్ ఆఫ్ టోర్నీ: మాథ్యూ షార్ట్
# డబ్ల్యూబీబీఎల్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ: చమరి ఆటపట్టు
# వూల్‌వర్త్స్ క్రికెట్ బ్లాస్టర్ ఆఫ్ ది ఇయర్: తాజ్ బోవర్