China Corona: చైనాలో కరోనా కేసులు ఉల్క వేగంతో పెరుగుతూ ఉన్నాయి. వైరస్ బారిన పడిన ప్రజలు కోకొల్లలుగా మరణం బారిన పడుతున్నారు. ఆ దేశంలోని ఐసీయూల్లో ఆస్పత్రి బెడ్లు పేషంట్లతో నిండిపోయాయి. దేశవ్యాప్తంగా శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ప్రజలు తమ అయినవాళ్ల అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి ఉండవలసి వస్తోంది. రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. కానీ డ్రాగన్ ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో కాకి లెక్కలు చెప్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కొవిడ్-19 కారణంగా కొద్ది మంది మాత్రమే మరణిస్తున్నారని చైనా అధికారులు తెలిపారు. రద్దీగా ఉంటే ఆస్పత్రి వార్డులు నిండిన శ్మశాన వాటికల దృశ్యాలను చైనా ప్రభుత్వ మీడియా ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని సమాచారం.
జీరో కోవిడ్ పాలసీ పేరుతో మూడేళ్ల పాటు వైరస్‌ను కట్టడి చేయగలిగిన చైనా.. ప్రజల జీవితాలతో ఆటాడుకుంది. కానీ ఆ పాలసీ బెడిసి కొట్టడంతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ మీద దృష్టి పెట్టకపోవడం.. అందుకు సంబంధించిన పరిశోధనలు సజావుగా జరగకపోవడం వల్ల కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. చేసేదేమీ లేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రపంచంలో ఏ దేశం కరోనాతో ఇంత భయానకమైన పరిస్థితిని ఎదుర్కొలేనంత దారుణంగా తయారైంది పరిస్థితి. చైనాలో ప్రస్తుతం కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు బెడ్లు దొరకడం లేదు. ఎక్కడ పడితే అక్కడ పేషెంట్లకు చికిత్స అందించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లు.. ఆస్పత్రుల నిరాకరణతో సుదూర ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో మరణాలూ సంభవిస్తున్నాయి.
Winter Storm in America: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. అల్లాడిపోతున్న జనం
జాతీయ ఆరోగ్య కమిషన్ తాజా మార్గదర్శకాల ప్రకారం.. కోవిడ్-19 సోకిన తర్వాత న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యం కారణంగా మరణించిన వారిని మాత్రమే కోవిడ్ మరణాలుగా పరిగణిస్తారని అగ్రశ్రేణి అంటు వ్యాధి వైద్యుడు వాంగ్ గుయికియాంగ్ తెలిపారు. మరొక వ్యాధి లేదా గుండెపోటు వంటి అంతర్లీన పరిస్థితి కారణంగా మరణించినట్లు భావించే వారు ఆ సమయంలో కొవిడ్ బారిన పడినప్పటికీ, వైరస్ మరణంగా పరిగణించబడదని ఆయన చెప్పారు. ఇదంతా మరణాల లెక్కలను దాచేందుకు ప్రయత్నం అని స్పష్టంగా తెలుస్తోంది. బీజింగ్ నుంచి శవాల వాహనాలు క్యూ కడుతున్నాయి.
