NTV Telugu Site icon

Daaku Maharaj : ఇది అస్సలు ఊహించలేదే.. డాకు మహారాజ్ లో దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan Speech

Dulquer Salmaan Speech

Daaku Maharaj : బాబీ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. భారీ బడ్జెట్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్ కార్యకలాపాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇటీవలే అమెరికాలోని డల్లాస్‌లో ‘డాకు మహారాజ్’ ప్రీ-రిలీజ్ జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు డల్లాస్ ‘డాకు మహారాజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వేదికగా మారింది. బాలయ్య, ఇతర నటీనటులు, సిబ్బందితో కలిసి ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Read Also:Tollywood : టాలీవుడ్ లో పాగా వేస్తున్న కన్నడ బ్యూటీ

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ పై డైరెక్టర్ బాబీ ఓ క్రేజీ విషయాన్ని చెప్పారు. ‘డాకు మహారాజ్’ సినిమా స్క్రిప్ట్ రాసే టైంలో కథకు అవసరం అని భావించి మరో పాత్ర అనుకున్నాడట. ఆ పాత్రలో దుల్కర్ సల్మాన్ ను తీసుకోవాలని భావించాడట. ఐతే, ఆ తర్వాత కథకు ఆ పాత్ర అవసరం లేదు అనిపించింది. అందుకే, దుల్కర్ సల్మాన్ “డాకు మహారాజ్”లో నటించలేదు’ అంటూ బాబీ చెప్పుకొచ్చాడు. కాగా సినిమాలో కొత్త ప్రపంచాన్ని చూస్తారని డైరెక్టర్ తెలిపారు. ప్రేక్షకులకు కచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని బాబీ తెలిపారు. ఇక “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, 2025న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్‌ ఫోర్ సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Read Also:DK Aruna: రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం

Show comments