NTV Telugu Site icon

Crazy News: శాలరీ మాట్లాడటానికి మా అమ్మను తీసుకురావొచ్చా?

Salary

Salary

ప్రైవేట్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి పలు అనుమానాలు, భయాలు ఉంటాయి. శాలరీ ఎక్కువ అడిగితే మా దగ్గర ‘అంతలేదు’ అంటారేమోనని, ‘ఫోన్‌ చేస్తాం’ అని చెప్పి పంపిస్తారేమోనని అనుకుంటారు. అసలు అవకాశమే ఇవ్వరేమోనని ఆందోళన చెందుతారు. ఆల్రెడీ వేరే చోట ఉద్యోగం చేసేవాళ్లు మరో సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎక్స్‌పెక్టెడ్‌ శాలరీని ప్రస్తుత వేతనం కన్నా ఐదు వేలో, పది వేలో పెంచి చెప్పటానికి జంకరు. ఎందుకంటే కొత్తోళ్లు ఛాన్స్‌ ఇవ్వకపోయినా చేతిలో ఉద్యోగం ఉంది కదా అనే భరోసా ప్రదర్శిస్తారు.

కానీ ఏ పనీ లేక ఖాళీగా ఉండేవాళ్లు గతంలో తీసుకున్న శాలరీకి సమానమైన జీతం వచ్చినా సంతోషిస్తారు. ఇదంతా ఇప్పుడెందుకంటే శాలరీ మాట్లాడే అంశంపై సోషల్‌ మీడియాలో వచ్చిన ఒక పోస్టింగ్‌ క్రేజీ న్యూస్‌ అయింది. అందులో చమత్కారం ఉండటంతో యూత్‌కి బాగా కనెక్ట్‌ అయింది. నితేష్‌ యాదవ్‌ అనే టెకీ ఈ పోస్టింగ్‌ని లింక్డిన్‌లో పెట్టాడు. ఎంత శాలరీ అడగాలో తెలియని పరిస్థితే తనకు ఎదురైతే ‘మా అమ్మను తీసుకురావొచ్చా?’ అని అడగాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఆమె అయితేనే ఈ సమస్యను చక్కగా డీల్‌ చేస్తుందన్నాడు. ఈ బ్రిలియంట్‌ ఐడియా ఓ రేంజ్‌లో ఫన్‌ క్రియేట్‌ చేసింది.

లక్ష లైకులను, వందల రియాక్షన్లను సొంతం చేసుకుంది. నెటిజన్లు సైతం దీనికి తగ్గట్లే కామెంట్లు పెట్టారు. ‘అమ్మ ఒక్కతేనా?. నాన్నను కూడా తీసుకురావటానికి అవకాశం ఉందేమో అడుగుతా’ అని ఓ వ్యక్తి స్పందించాడు. ‘మా అమ్మే గనక రంగంలోకి దిగితే హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ మూర్ఛపోవటం ఖాయమని మరో వ్యక్తి పేర్కొన్నాడు. ‘అమ్మ మాత్రమే ఉత్తమ బేరం చేయగలదు’ అని ఇంకో యూజర్‌ అభిప్రాయపడ్డాడు. ‘అమ్మతోపాటు పక్కింటి ఆంటీనీ తీసుకొస్తే ఇంకా బాగా పనవుతుంది’ అంటూ నాలుగో నెటిజన్‌ కామెడీ చేశాడు. ఈ పరంపర ఇంకా కొనుసాగుతూనే ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.

posting