Site icon NTV Telugu

Crazy Job: ఎలకలు పడితే రూ.1.2కోట్ల జీతం.. కాకపోతే కండిషన్స్ అప్లై..

Rat Kills

Rat Kills

మనలో చాలామందికి ఎలుకల సమస్య అంతా ఇంతా కాదు. ఎలుకలు ఎక్కడ ఉన్నా తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇంట్లోని చెక్క వస్తువులను, పండ్లు, కూరగాయలతో పాటు, ధాన్యం లాంటి వాటిని కూడా నాశనం చేస్తాయి. ఎలుకలు మనుషులకు హాని చేయనప్పటికీ., అవి చేసేవి ప్రజలకు చికాకు కలిగిస్తాయి. ఇకపోతే, న్యూయార్క్‌ లో ఈ ఎలుకలు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.

Also Read: GT vs RCB: గుజరాత్ ను ఆదుకున్న సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్.. బెంగళూరు టార్గెట్ 201..

న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఎలుక బాధతో ఓ ‘ర్యాట్‌ క్యాచర్‌’ ను నియమించారు. ఇందుకుగాను ఎలుకలు పట్టేవారికి జీతం అక్షరాలా 1.2 మిలియన్ రూపాయలు అంటే 1.2 కోట్లు కావడం గమనార్హం. నగర మేయర్ ఎలుకల నియంత్రణ కోసం “డైరెక్టర్ ఆఫ్ రోడెంట్ కంట్రోల్” ఉద్యోగం కోసం అభ్యర్థులను ఆహ్వానించారు. దాంతో ఇప్పటి వరకు 900 మంది దరఖాస్తు చేసుకోగా.. ‘కాథ్లీన్ కొరాడి’ ఇందుకు గాను ఎంపికైంది. ఆమె స్కూల్‌ లో టీచర్‌ గా పనిచేస్తుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఎలుకల నియంత్రణపై పరిశోధనలు నిర్వహించి వాటికి ఆహారం, నీరు అందుబాటులో లేకుండా చేసింది.

Also Read: Elon Musk: చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్.. ఎందుకోసమంటే..?

ఈ టాస్క్‌లో భాగంగా, ఆమె ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం, చెత్తను ఎలుకలు కనుగొనకుండా చేయడం, ఎలుకల సంఖ్యను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. వీటితోపాటు భూగర్భ రైళ్లలో ఎలుకలు నివాసాలను ఏర్పాటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఈ ఎలుకల నిర్మూలనలో కొన్ని ఖచ్చితమైన పలు ఆంక్షలు కూడా ఉన్నాయి. ఎలుకలను విషంతో చంపకూడదు. విషపూరితమైన ఆహారాన్ని తిన్న ఎలుకలు చనిపోతే ఏ జీవికైనా ప్రాణాపాయం ఉంటుంది. అందువల్ల, ఎలుకల విషాన్ని వాడకుండా రూల్స్ పెట్టారు.

Exit mobile version