ప్రపంచంలో చాలామంది వారి జీవితంలో ఉరుకుపరుగులతో క్షణ సమయం తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే మహిళల విషయానికి వస్తే ఇంట్లోని పనులు, మరోవైపు ఆఫీసు పనులతో విశ్రాంతి లేని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం సమయం దొరికినా కొందరు వారు ఆ సమయాన్ని తమకు చాలా అనుకూలంగా మార్చుకుంటుంటారు. అంతకి అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ఓ మహిళ ట్రాఫిక్ జామ్ మధ్యలో చేసిన పని చూస్తే మాత్రం అవాక్కయ్యేలా ఉంది.
Also Read: Viral: ఎవర్రా మీరంతా.. ఒక్కసారిగా వధువుపై పడ్డ అతిథులు.. చివరకి..?!
ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఓ మహిళ పనుల నిమ్మిత్తం స్కూటీలో వెళ్తుండగా.. ఉన్నట్టుండి దారిమధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ ట్రాఫిక్ జామ్ ఎంతసేపటికీ క్లియర్ కాకపోవడంతో ఆమెకు ఓ అదిరిపోయే ఆలోచన వచ్చింది. దాంతో వెంటనే.. ఆ సమయాన్ని ఎందుకు వృథా చేయడం.. అని అనుకుందే తెలియదు కానీ.. వెంటనే స్కూటీ ముందు భాగంలో ఉన్న బ్యాగులోంచి కూరగాయలను బయటికి తీసింది. ఆపై తన స్కూటీ సీటుపై పేపర్ పెట్టుకొని, అందులో కూరగాయలను చేత్తో కట్ చేసింది. నిజానికి ఈమె తన పని కోసం వంట గదిలో గడపాల్సిన సమయాన్ని కాస్తా.. రోడ్డుపైనే సద్వినియోగం చేసుకుంది.
Also Read: Supreme Court: టీచర్ బలవంతంగా విద్యార్థినికి ఫ్లవర్స్ ఇవ్వడం లైంగికంగా వేధించడమే..
దీనితో ఆమె చేస్తున్న నిర్వాకం చూసి అక్కడున్న వాహనదారులంతా ఒకింత అవాక్కయ్యారు. చాలామంది ఆమె ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ అక్కడివారు నవ్వుకున్నారు. ఎన్ని ఉన్నకాని ఆమె మాత్రం ఎవరినీ పట్టించుకోకుండా కూరగాయలను మొత్తం తరిగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సొసైల్ మీడియాలో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అసలు మీకు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయమ్మా.. ’’అంటూ కొందరు అనగా., మరికొందరు ‘‘ట్రాఫిక్ జామ్‌ను ఎంత బాగా వాడేశావమ్మా అనగా.. మరికొందరైతే ‘‘ఇది కదా వాడకం అంటే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.