BV Raghavulu: అరకు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తాం.. అసెంబ్లీ స్థానాలపై తేడాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: సీపీఎం అరకు ఎంపీ స్ధానానికి పోటీ చేస్తుందని వెల్లడించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. స్వతంత్రంగా గెలిచే బలం మాకు లేదు, అలాంటి ఆశ కూడా మాకు లేదన్నారు.. అయితే, అసెంబ్లీ స్ధానాలకు సంబంధించి చర్చల్లో కొన్ని తేడాలు ఉన్నాయన్నారు. మేం గొంతెమ్మ కోర్కెలు కోరే వాళ్ళం కాదు.. కాంగ్రెస్ పార్టీకి గతంలో తక్కువ ఓట్లు వచ్చిన స్ధానాల్లో మేం సీటు అడిగాం అని గుర్తుచేశారు. ఇక, వాలంటీర్ల దుర్వినియోగంపై టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు నెపం నెట్టుకోడానికే మాట్లాడుతున్నారని విమర్శించారు. వాలంటీర్ల అంశంలో బీజేపీ సుద్దులకు విలువ లేదన్నారు.
Read Also: Konda Vishweshwar Reddy: నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు..
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
మరోవైపు, ఏపీలో పొత్తులపై హాట్ కామెంట్లు చేశారు రాఘవులు.. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏపీ ఎప్పుడు చూడనంత అపవిత్ర పొత్తుగా అభివర్ణించారు. ఏ మొహం పెట్టుకుని ముగ్గురూ కలిసారు.. ఇది ఒక నిజాయితీ లేని పొత్తు అన్నారు. అన్ని పార్టీలు మా కూటమిలో ఒకే స్ధాయిలో ఉన్నాయి.. అక్కడ మాత్రం పెద్ద పార్టీలు నిర్ణయిస్తాయన్నారు. ఇక, కేరళ సీఎం కూతురుపై కాకతాళీయంగా దొరికిన దానిని వాడుకుని చిక్కుముడి వేసి అనుమానాలు సృష్టించడానికే ఈడీ దాడులు చేస్తుందని మండిపడ్డారు. సీపీఎంపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారన్నారు. మహారాష్ట్రలో, ఒంగోలులో బీజేపీలో చేరినవారు గతంలో అవినీతిపరులుగా బీజేపీ ముద్ర వేసినవారే అని వ్యాఖ్యానించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు. కాగా, ఏపీలో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.. ఇక, కాంగ్రెస్-సీపీఎం-సీపీఐ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!