Site icon NTV Telugu

Tammineni Veerabhadra : ఆ పార్టీతోనే కలిసి ఉంటాం.. సీట్ల పంపకాలు తరువాత..

Veerabaradam

Veerabaradam

మూడు రోజులపాటు ఢిల్లీలోని సుర్జిత్ భవన్ లో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతు.. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది అని తమ్మినేని తెలిపారు.

Also Read : Amit Shah: కాంగ్రెస్‌కు మైండ్ దొబ్బింది.. “విష సర్పం” వ్యాఖ్యలపై ఫైర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు మీద దాడులు చేస్తున్న బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో ఉంది అని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్ని పర్యటనలు చేసిన ఆశించిన స్థాయిలో బీజేపీలో చేరికలు లేవు అని విమర్శించారు. అసంతృప్త నాయకులు కాంగ్రెస్, ఇతర పార్టీలో చేరుతున్నారు తప్ప బీజేపీ పార్టీలో కాదు అని అన్నారు.

Also Read : Jagananna Vidya Kanuka: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. స్కూళ్లు తెరిచిన రోజే విద్యాకానుక..

మునుగొడు ఎన్నికల్లోనే కాదు, వచ్చే ఎన్నికల్లో కూడా సీపీఎం-సీపీఐ కలిసి ఉంటాయి అని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం క్లారిటీ ఇచ్చారు. సీపీఐ-సీపీఎంతో కలిసి బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తుందని కేసీఆర్ కూడా చెప్పారు అని ఆయన గుర్తు చేశారు. బీఆర్ఎస్ తోనే కలిసి ముందుకు వెళ్తాము.. సీట్ల పంపకాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తమ్మినేని అన్నారు.

Also Read : Ponniyin Selvan Part 2 Review: పొన్నియిన్ సెల్వన్ -2 (డబ్బింగ్)

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రేమ కంటే కులగణన ఎందుకు చేయడం లేదో చెప్పాలని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ప్రజల్లో చిచ్చు లేపటం మాని బీజేపీ కులగణన చేపట్టాలి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వాగ్ధానాలు నెరవేర్చడం లేదు.. ఇళ్ల పట్టాలు, పోడు భూములు, కనీస వేతనాలపై కూడా పోరాటం చేస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు.

Exit mobile version