BV Raghavulu: అసమానతలు లేని అభివృద్ధి కావాలి.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: అసమానతలు లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌కి కావాలని ఆకాక్షించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న సెమినార్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ జరుగుతుందన్నారు. ప్రజాశ్రేయస్సు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.. గతంలో చంద్రబాబుగానీ, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ గానీ ప్రజలులకు ఎంతో చేశామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సంక్షేమం జాడ కనిపించడం లేదన్నారు రాఘవులు.
Read Also: Harish Rao: బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు
Also Read
ఇక, జీఎస్డీపీ పెరిగిందని చెబుతున్న లెక్కలేవీ రాష్ట్ర నికర అభివృద్ధికి తోడ్పటం లేదన్నారు బీవీ రాఘవులు.. చంద్రబాబు హయాంలో జీఎస్డీపీ 9.3 శాతం ఉందని చెప్పినా, ప్రస్తుతం జీఎస్డీపీ 7.3 శాతం ఉందని చెప్పినా.. అవన్నీ ఒకటీరెండు రంగాలకే పరిమితం అయ్యాయని స్పష్టం చేశారు. అప్పట్లో చేపల ఎగుమతి, ప్రస్తుతం ఇసుక, మైనింగు రూపంలో అభివృద్ధి ఉందన్న ఆయన.. అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో మెరుగదల లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు ప్రత్యక్ష విదేశీ నిల్వలు బిలియన్లలో వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మిలియిన్లలో మాత్రమే వస్తున్నాయని వివరించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!