Site icon NTV Telugu

BV Raghavulu: అసమానతలు లేని అభివృద్ధి కావాలి.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ..!

Bvr

Bvr

BV Raghavulu: అసమానతలు లేని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌కి కావాలని ఆకాక్షించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.. విజయవాడలో ఏపీ సమగ్రాభివృద్ధి, ప్రత్యామ్నాయ విధానాలు అనే అంశంపై సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరగనున్న సెమినార్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో యథేచ్ఛగా ఆస్తుల లూఠీ, నిధుల దోపిడీ జరుగుతుందన్నారు. ప్రజాశ్రేయస్సు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.. గతంలో చంద్రబాబుగానీ, ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్ గానీ ప్రజలులకు ఎంతో చేశామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే సంక్షేమం జాడ కనిపించడం లేదన్నారు రాఘవులు.

Read Also: Harish Rao: బీజేపీ జాకీ పెట్టిన తెలంగాణలో లేవదు.. కాంగ్రెస్ గెలవదు

ఇక, జీఎస్‌డీపీ పెరిగిందని చెబుతున్న లెక్కలేవీ రాష్ట్ర నికర అభివృద్ధికి తోడ్పటం లేదన్నారు బీవీ రాఘవులు.. చంద్రబాబు హయాంలో జీఎస్‌డీపీ 9.3 శాతం ఉందని చెప్పినా, ప్రస్తుతం జీఎస్‌డీపీ 7.3 శాతం ఉందని చెప్పినా.. అవన్నీ ఒకటీరెండు రంగాలకే పరిమితం అయ్యాయని స్పష్టం చేశారు. అప్పట్లో చేపల ఎగుమతి, ప్రస్తుతం ఇసుక, మైనింగు రూపంలో అభివృద్ధి ఉందన్న ఆయన.. అభివృద్ధిలో కీలకమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో మెరుగదల లేదని విమర్శించారు. పక్క రాష్ట్రాలకు ప్రత్యక్ష విదేశీ నిల్వలు బిలియన్లలో వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మిలియిన్లలో మాత్రమే వస్తున్నాయని వివరించారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.

Exit mobile version