NTV Telugu Site icon

V Srinivasa Rao: రాజకీయాన్ని ప్రజా సేవగా మార్చాలి.. అందుకే ప్రజల నుంచి విరాళాల సేకరణ..

V Srinivasa Rao

V Srinivasa Rao

V Srinivasa Rao: రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ప్రజలకు, ఓటర్లకు డబ్బులు ఎర వేసి ఓట్లు లాక్కోవాలి… గుంజుకోవాలని చూస్తున్నాయి.. కానీ, సీపీఎం మాత్రం ప్రజల నుంచే విరాళాలు సేకరిస్తోంది.. ఇది ప్రజల పార్టీ అన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటింటి నిధి వసూలు కార్యక్రమం చేపట్టింది సీపీఎం.. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేటర్ల దగ్గర మేం నిధులు తీసుకోలేదు.. ఎన్నికల్లో డబ్బులు పంచే పార్టీలు మావి కావు.. ప్రజల్లో నుంచి, ప్రజల కోసం పని చేస్తాం.. కాబట్టి ప్రజలు నుంచి నిధులు సేకరిస్తున్నాం అన్నారు. ఈ రోజు రాజకీయంలో అవినీతి విచ్చల విడిగా సాగుతుంది.. కానీ, రాజకీయాన్ని ప్రజా సేవగా మార్చాలి అని పిలుపునిచ్చారు.

Read Also: Mamata Banerjee: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ నిరసన

ఈ నెల 5వ తేదీ నుంచి మూడు రోజులు పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.. అసెంబ్లీ సమావేశాలు తూ తూ మంత్రంగా జరుగుతున్నాయి.. అసెంబ్లీ గానీ, ఎమ్మెల్యేలు గానీ ఏ అధికారం లేని ఒక ఖాళీ చెత్త బుట్టలా తయారైంది అంటూ ఫైర్‌ అయ్యారు శ్రీనివాసరావు.. చర్చిందేది లేదు.. నిర్ణయాలు తీసుకునేది లేదు.. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ఆమోదించే విధంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అని ఎద్దేవా చేశారు. వైసీపీలో 41 ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని ప్లేస్ ఛేంజ్‌ చేశారు.. మిగతా 109 మంది మీద ప్రజా భిమానం ఉందని భావిస్తున్నారు.. కానీ, వారు మాత్రం ముఖ్యమంత్రి మీద ఉన్న వ్యతిరేకతతో ఒడిపోతామని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన ఆయన.. ప్రజా అభిమానాన్ని కోల్పోయింది.. తద్వారా ప్రజల్లో అసంతృప్తి కనిపిస్తుంది.. ఏ వర్గం వారు సంతృప్తిగా లేదు. అన్ని వర్గాలు వారు రోడ్డెక్కారు.. ఒక మూగ జీవి కింద అసెంబ్లీని తయారు చేశారు.. అటు పార్లమెంట్ లోనూ, ఇటు రాష్ట్రంలోనూ కూడా సమావేశాలు అలానే ఉన్నాయి.. ప్రజా సమస్యలపై చర్చ జరిగే విధంగా సమావేశాలు సాగాలని సూచించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.