Site icon NTV Telugu

CPI Ramakrishna: ఎన్నికల కోసమే ఉమ్మడి రాజధాని డ్రామా..!

Cpi Ramakrishna

Cpi Ramakrishna

CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని వ్యవహారం వివాదాస్పదంగా మారింది.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో దుమారం రేగింది.. అయితే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది ఉమ్మడి రాజధాని విధానం కాదు.. వైవీ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. అయితే, వైసీపీని టార్గెట్‌ చేస్తూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి.. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. ఎన్నికలు సమీపిస్తున్నందున హైదరాబాద్ రాజధాని డ్రామాకు వైసీపీ తెరలేపిందని మండిపడ్డారు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని నిర్వీర్యం చేశారు.. వైసీపీ మూడు ముక్కలాటతో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగున్నరేళ్లుగా హైదరాబాద్ ఊసే ఎత్తని వైసీపీ, ఇప్పుడు నిద్రలేచిందని… హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మరో రెండేళ్లు కావాలంటూ మరో కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రోజున నాగార్జునసాగర్ డ్యాం పై హడావుడి సృష్టించి.. కేసీఆర్‌కు లబ్ధి చేకూర్చేందుకు విశ్వ ప్రయత్నం చేశారని ఆరోపించారు. వైసీపీ ఎన్నికల డ్రామాలు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.

Read Also: IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా!

Exit mobile version