Anganwadi Strike: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది.. నెల రోజుల దాటినా.. పలు మార్లు ప్రభుత్వం-అంగన్వాడీల మధ్య చర్చలు జరిగినా విఫలం అయ్యాయి.. దీంతో.. అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తూనే ఉన్నారు.. వారి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు విపక్షాలు మద్దతు ప్రకటించాయి.. మీ ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు వారికి మద్దతుగా పోరాటాలు చేస్తున్నాయి.. అయితే, అంగన్వాడీలకు తానిచ్చిన హామీని అమలు చేస్తానని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు దూరం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట అమలు చేసుంటే అంగన్వాడీలు రోడ్డేక్కేవారా..? అని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చర్చలెందుకు జరపటం లేదు అని నిలదీశారు.. న్యాయమైన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉందన్నారు. అయితే, సర్కార్‌కు అంగన్వాడీ కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది అంటూ వ్యాఖ్యానించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కాగా, నెలరోజుల దాటిని పట్టు వీడకుండా.. రోజుకో రూపంలో ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు అంగన్వాడీలు.. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం విదితమే.
Read Also: VC Sajjanar: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ రికార్డు కలెక్షన్లు.. ఒక్క రోజే 52.78 లక్షల మంది జర్నీ..
