D Raja: ప్రకాశం జిల్లాలో ప్రకటించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అనేక విషయాలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటని అన్నారు. ప్రజా సమస్యలపై సుధాకర్ రెడ్డి జీవితాంతం పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్కర్ ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియదంటూనే.. ఆయన రాజీనామా వెనుక రాజకీయ వత్తిడిలు ఉన్నాయన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించామని ఆయన అన్నారు. ఈ సందర్బంగా సుదర్శన్ రెడ్డి ని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలని కోరుతున్నామన్నారు.
BCCI-Dream 11: డ్రీమ్ 11తో బీసీసీఐ ఒప్పందం రద్దు.. ఐపీఎల్‌కూ రాంరాం!
జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. భారత్ – పాక్ యుద్దం ఆపానని ట్రంప్ చెబుతున్నారని.. యుద్దం ఎవరు ఆపారో ప్రధాని మోడీ నోరు విప్పి చెప్పడం లేదన్నారు. భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారని.. రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చెయ్యవద్దని భారత్ కి ట్రంప్ ఎలా చెబుతారని ఆయన మండిపడ్డారు. ప్రత్యర్థి పార్టీలే టార్గెట్ గా ఈడి, ఐటిలను బీజేపీ వాడుతుందని.. దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలని ఆయన అన్నారు. అయితే, బీహార్ లో అలాంటి పరిస్థితులు లేవని.. బీహార్ లో ఎన్నికల కమిషన్ విధుల్లో ఫెయిల్ అయ్యిందని మండిపడ్డారు.
ఫ్యాషన్ క్వీన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా హీట్ పెంచింది
రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని.. దేశంలో ప్రధాని మోడీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తుందని దుయ్యబట్టారు. ఇంకా రాష్ట్రంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. నక్సలైట్లు పేరుతో గిరిజనుల్ని అమిత్ షా చంపుతున్నారని.. అటవీ భూమిల్ని కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టెందుకే గిరిజన ప్రజల్ని చంపుతున్నారని ఆయన మండిపడ్డారు.
