NTV Telugu Site icon

CPI Naryana: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలి..

Cpi Naryana

Cpi Naryana

CPI Naryana: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కొన్ని వ్యాఖ్యలు చేసారు. సీపీఐలో కష్టపడి పని చేసిన బాల మల్లేష్.. శ్రీనివాస్ రావులు రాష్ట్ర సహా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. పశ్య పద్య జాతీయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని.. హైడ్రా చర్యల వల్ల బడా బాబులు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది లేదా.. వాళ్ళ ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయిన జైలుకు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధానిగా మోడీ అయ్యాక నేను సన్యాసిని.. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు అన్నారు. 2014 లో 2.25 లక్షల కోట్లు IP ఉంటే.. ఇప్పుడు 16 లక్షల కోట్లు ఉందన్నారు. అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళలో ఒక్క విజయ్ మాల్య తప్ప మిగితా అందరూ గుజరాత్ వల్లే అని ఆయన పేర్కొన్నారు.

Pakistan Cricket: చెత్తగా ఓడినా డ్రెస్సింగ్‌ రూమ్‌లో నవ్వుకుంటున్నారు.. పాక్ క్రికెటర్లపై మాజీలు ఫైర్!

మోడీ దయ దక్షణ్యల వల్ల అదానీ పెరిగారు. ఆయన సొంతంగా ఎదగలేదు. సెబి కూడా అదానీకి దాసోహం అయ్యింది. పదేళ్లలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నిత్యావసర సరుకుల ధరలు పెరుగుదలకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలకు జాతీయ సీపీఐ పిలుపు ఇచ్చింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య మీద గవర్నర్ విచారణ చేయవచ్చు అని తెలిపారు. గవర్నర్ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక బ్రోకర్ అని., కేంద్రం గవర్నర్ ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బకొట్టలని చూస్తున్నారని.. ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతిస్తున్నారని తెలిపారు. అందరూ కలసి ఉండాలని., లేదంటే దేశం విడిపోతుందని., RSS మోడీనీ మార్చే ప్రయత్నాలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.