NTV Telugu Site icon

CPI Narayana: రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తి..

Cpi Narayana

Cpi Narayana

CPI Narayana: రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలక్షణమైన వ్యక్తి అని కొనియాడారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ.. అమరావతిలో జరిగిన వైఎస్సార్ 75వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు బిళ్ల పెట్టుకుని తిరుగుతున్నారు.. రాజకీయ నాయకులు పూటకో పార్టీలో ఉంటున్నారు.. కానీ, వైఎస్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక ఇబ్బందులు వచ్చినా నిలబడ్డారని.. రాజకీయాల్లో వైఎస్ విలక్షణమైన వ్యక్తిగా అభివర్ణించారు నారాయణ.

Read Also: Minister Ramprasad Reddy: ప్రతి తహసిల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుల బాక్స్.. ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా కృషి..

ఇక, డబుల్‌ ఇంజిన్ సర్కార్ పై మరింత పోరాటం చేయాలని సూచించారు నారాయణ.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే నష్టం అని ఆరోపించారు.. ప్రమాదకరమైన బీజేపీతో చంద్రబాబు ఉన్నారు.. మరోవైపు.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇక, కమ్యూనిస్టులపై వైఎస్‌కు మంచి అభిప్రాయం ఉందన్నారు.. అంతేకాదు.. అది నిరూపించారని కూడా గుర్తుచేశారు. కొందరు నేతలు మనం మంచిగా ఉన్నప్పుడే పలకరిస్తారు.. లేకపోతే పక్కకు పోతారు.. కానీ, వైఎస్‌ అలాంటి వ్యక్తి కాదు.. ఎవరైనా కలిస్తే.. పరిస్థితి ఏంటి? అని ఆరా తీసి.. సహాయం చేసేవారని కొనియాడారు. అయితే, వైఎస్‌ ఉండిఉంటే.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదన్నారు.. ఒకవేళ తెలంగాణ ఏర్పడినా.. టీఆర్ఎస్‌ మాత్రం ఉండేది కాదన్నారు నారాయణ.. ఇంకా ఆయన ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Show comments