Site icon NTV Telugu

CPI Narayana: టీటీడీ గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు!

Cpi Narayana

Cpi Narayana

తాను చేతులెత్తి జోడిస్తున్నా అని, టీటీడీ గోశాలను ఎవరూ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కోరారు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని, టీటీడీపై రాద్ధాంతం మానుకోండన్నారు. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని, న్యాయవ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. తిరుపతిలో టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై వైసీపీ, కూటమి నేతల మధ్య రాజకీయ దుమారం రేగింది. ఈ వివాదంపై నారాయణ స్పందించారు.

‘అందరికి చేతులెత్తి జోడిస్తున్నాను, గోశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు. హైడ్రామా సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దు. టీటీడీపై రాద్ధాంతం మానుకోండి. రాజకీయ రాద్ధాంతం జరిగితే టీటీడీ ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ‘ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను ఖండిస్తున్నా. న్యాయవ్యవస్థను ధ్వంసం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తులను గవర్నర్‌లుగా చేసి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్‌దే పెత్తనంలా మారింది. గవర్నర్‌ల నిర్ణయాలపై పలు రాష్ట్రాల సీఎంలు కోర్టును ఆశ్రయించారు. గవర్నర్ల నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీర్పును ఉపరాష్ట్రపతి ఆక్షేపించడం సరైన పద్థతి కాదు. ఫీజు రీయింబర్స్ మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఫీజు రీయింబర్స్ ఆలస్యం ప్రభుత్వ క్రిమినల్ చర్యగా భావించాలి. లక్షల మంది విద్యార్థుల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆయన మండిపడ్డారు.

Exit mobile version