NTV Telugu Site icon

CPI Narayana : ప్రధాని మోడీపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు

Cpi Narayana

Cpi Narayana

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీని చంపిన గాడ్సే నోట నుండి పుట్టినోడే నరేంద్ర మోడీ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంలో 24 మంది మంత్రులు పైన లైంగిక దోపిడీ కేసులు ఉన్నాయని, దోపిడి పైన ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని పార్లమెంటును సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సీపీఐ నారాయణ. బీజేపీ నాయకులురా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ కాలు వెంట్రుకల కూడా సరిపోరూ మీరూ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగం పైన కుట్ర చేస్తుందని తరిమి కొట్టడానికి జాతీయం 17 పార్టీలు మొత్తం కలిసి పోరాటం చేస్తున్నామని ఆయన పేరుకున్నారు. దేశంలో అవినీతి ఎక్కువైపోయిందని అందువలన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read : First Night: మొదటి రాత్రి పాలు ఎందుకు తాగుతారంటే..

అదానీ, అంబానితో మీకున్న సంబంధాలు ఏమిటని లోక్​సభలో ప్రశ్నించినందుకు రాహుల్​గాంధీపై వ్యూహాత్మాకంగానే కుట్ర చేశారని అన్నారు. రాహుల్​ గాంధీ కుటుంబం దేశం కోసం ఆస్తులను అప్పగించింది, అమరులైన చరిత్ర ఉందన్నారు. అలాంటి కుటుంబంపై కక్షపూరితంగా కేసు నమోదు చేయడం, అవినీతి మెజిస్ట్రేట్​తో తీర్పు చెప్పించడం జరిగిందన్నారు. దేశంలో అవినీతి ఎక్కువైపోయిందని అందువలన ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యాదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్రచారీ, ముత్యాల యాదగిరి రెడ్డి, ఓరుగంటి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Also Read : విరూపాక్ష కన్నా ముందు చేతబడుల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఇవే..