ఫస్ట్‌నైట్ రోజు వధువు కుంకుమపువ్వు పాలతో ఎందుకు గదిలోకి వెళ్తుందని మీరెప్పుడైనా కనుక్కున్నారా.. ఈ ఆచారం వెనుక ఏదైనా వాస్తవం ఉందా.. ఏం కారణాలు ఉన్నాయి.

అసలు ఫస్ట్‌ నైట్‌ రోజున ఎందుకు పాలు తాగుతారు. అందులో ఏమేం కలుపుతారు. దీని వల్ల లాభాలు ఏంటో తెలుసుకున్నారా?

ఆనందకరమైన వైవాహిక జీవితానికి మొదటి రాత్రి పునాది. సంప్రదాయాల ప్రకారం, ఓ గ్లాసు కుంకుమపువ్వు పాలతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించడం వల్ల బంధానికి మధురానుభూతి చేకూరుతుందని నమ్ముతారు.

పాలు, కుంకుమపువ్వులను అనేక ఆచారాలలో వాడతారు. ముఖ్యంగా పాలను శుభప్రదంగా వాడతారు. వివాహమైన మొదటిరాత్రి పాల మిశ్రమాన్ని తీసుకోవడానికి ఇదో ముఖ్య కారణం. 

చాలా రోజులుగా కుంకుమపువ్వు కోరికలను రెచ్చగొట్టేందుకు వాడతారు. ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉండే పాలల్లో కుంకుమపువ్వు కలపడం వల్ల జీవశక్తి మెరుగుపడుతుంది. 

కొత్తగా పెళ్ళైన జంటకి ఈ పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అయితే మొదటి రాత్రి వీటిని తాగడం వెనుక లాజిక్ ఏంటంటే, రిలాక్స్‌డ్, హ్యాపీ రిలేషన్‌షిప్‌ని ప్రారంభించడమే.

పాలలో కుంకుమపువ్వుతో పాటు సోంపు కలుపుకుని తాగితే కోరికలు బాగా పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

అందుకే అనాది నుంచి మొదటి రాత్రి పాలు తాగడం సంప్రదాయంగా వస్తోంది. తెలియని వారు పాలలో ఏమి కలుపుకోకుండా తాగుతారు. 

పురాతన గ్రంధాల ప్రకారం, కామసూత్రలో పాలు తాగడం ఉంది. ప్రేమ పుట్టడానికి ముందు వీటిని తాగడం వల్ల లైంగిక శక్తి పెరుగుతుందని చెబుతారు. 

అయితే అప్పట్లో గ్లాసు పాలలో సోంపు, తేనె, పంచదార, మిరియాలు, కుంకుమపువ్వు వంటివి కలిపేవారు. ఇవి ప్రముఖ హిందూ వివాహ సంప్రదాయానికి దారి తీశాయి.