CPI Narayana: గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన చంద్రబాబుకు గట్టి షాక్ తగిలింది.. ఆ తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు.. అయితే, మరోసారి చంద్రబాబుకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విద్యుత్ మీటర్ల పై ఫైర్ అయ్యారు.. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చినా పాత వైసీపీ ప్రభుత్వం విధానాలే అవలంభిస్తుందని విమర్శించారు.. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోంది.. అదానీ కంపెనీతో పాటుగా మరో మూడు కంపెనీలకు దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్థను అప్పగించారు .. స్మార్ట్ మీటర్లు.. ప్రజల మెడకు ఉరితాడు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Shri Shakti Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
63 కేవీ 1 లక్ష 6 వేలకు విక్రయించాల్సి ఉంటే.. ఆ కంపెనీ 2 లక్షలకు విక్రయిస్తుందని దుయ్యబట్టారు నారాయ.. ఇలా ప్రతి వాటిపై భారీగా రేట్లు పెట్టి రైతులపై పెను భారం మోపుతున్నారని మండిపడ్డారు.. విద్యుత్ సంస్కరణలు తెస్తే ఒకసారి చంద్రబాబుకు షాక్ తగిలింది.. మళ్లీ ఇప్పుడు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.. మళ్లీ చంద్రబాబుకు కరెంటు షాక్ కొట్టడం ఖాయం అని హెచ్చరించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..
