Site icon NTV Telugu

CPI Narayana : ఆ యాప్‌ల కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం

Cpi Narayan

Cpi Narayan

CPI Narayana Fires on BJP Government

లోన్ యాప్ కట్టడి చేయడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోన్ యాప్ కేటుగాళ్ల బారిన పడి అమాయకులు బలై పోతున్నారన్నారు. అంతేకాకుండా… లోన్ అప్పు చెల్లించినా లోన్ యాప్ కేటుగాలు వేధింపులు అపడం లేదు. పీఎఫ్‌ఐ కుట్రను భంగం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. అంతటి ఉగ్ర కుట్రను ఛేదించే యంత్రాంగం ఉన్నా
దేశంలోని ఎందుకు లోన్ యాప్ కేటుగాల మూలాలను ఎందుకు కొనుక్కో లేక పోతుంది.. ఉగ్రవాదుల మూలాలు ఉన్న వారిని పట్టుకున్నామని జబ్బలు చర్చుకుంటున్న కేంద్ర ప్రభుత్వం. లోన్ యాప్ కేటుగాలను ఎందుకు పట్టించుకోవడం లేదు..

లోన్ యాప్ కేటుగాలను కఠినం శిక్షించాలి.. విజయవాడలో జరిగే మహా సభలకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారు.. బీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పాటు ను తాను స్వాగతిస్తున్నాం.. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పర్యటించారు.. కొత్త పార్టీ ఏర్పాటులో అనేక అవాంతరాలు ఉంటాయి… కానీ వెనకడుగు వేయవద్దు.. బీజేపీ వ్యతిరేకంగా పార్టీలనీ ఏకం చేసినప్పుడే కేసీఆర్‌ లక్ష్యం నేరవేరుతుంది.. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలను కలుపుకోవాలని నిన్న కేసీఆర్‌ మీటింగ్ కు వచ్చిన ఓ ఎంపీ చెప్పారు.. మాకు ఆహ్వానం ఉంది..కానీ మీరే వెళ్ళి లేదు.. బీజేపీ ఫ్యాక్షనిస్టులు కంటే దారుణంగా రాజకీయాలు చేస్తుంది అని ఆయన విమర్శించారు.

Exit mobile version