NTV Telugu Site icon

CPI Narayana : మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుంది

Cpi Narayana

Cpi Narayana

బీజేపీకి జై కొట్టు ఇంటికి పో…. లేదంటే జైలుకు పోతావ్ అని ప్రతిపక్షపార్టీలను ప్రధాని మోడీ ప్రభుత్వం భయబ్రాంతులకు గురి చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన అంశాలను అమలు పరచాలంటూ సీపీఐ చేపట్టిన పాదయాత్రకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ.. దేశం లోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ.. మోడీ ప్రభుత్వం రాక్షస పాలనను కొనసాగిస్తుందని ధ్వజమెత్తారు. బయ్యారం ఇనుప రాయి బలమైంది కాదంటున్నారని, కాజీపేట లో కోచ్ ఫ్యాక్టరీ ని ఏర్పాటు చేయాలని పోరాటం చేయడాన్ని నా చిన్నతనం నుండే చూస్తున్నామని, గిరిజన యూనివర్సిటీకి 50 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోతాయన్నారు.

Also Read : Manish Tewari : రాహుల్ పై అనర్హత వేటు.. లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా నోటీసు

విభజన చట్టం లో పేర్కొన్న అంశాల సాధన కు ముఖ్యమంత్రి కేసిఆర్ అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లి పార్లమెంట్ లో కొట్లాడాలన్నారు. సింగరేణి బొగ్గు ను కాదని ,ఆధాని దిగుమతి చేసుకునే బొగ్గును తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని , బిజెపి కి వ్యతిరేక రాష్ట్రాలలో ఆర్.ఎస్.ఎస్ లో పనిచేసిన వారిని గవర్నర్ లు గా నియమిస్తున్నరన్నారు.కేంద్ర క్యాబినెట్ లోని 24 మంది మంత్రుల పై కేసులు ఉన్నాయని, చుట్టూ దొంగలను పెట్టుకొని మోడీ పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆదివాసీ మహిళను రాష్ట్ర పతిగా నియమించి అటవీ చట్టాలను ప్రక్షాళన చేసి అటవీ భూములను కార్పోరేట్ సంస్థలకు కట్టబెట్టే యత్నం జరుగుతుందన్నారు. వచ్చే నెల 14 నుండి మే వరకు మోడీ హఠావో… దేశ్ కి బచావో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Also Read : Bilkis Bano rapist: గుజరాత్ ప్రభుత్వ కార్యక్రమం.. వేదికపై బీజేపీ నేతలతో బిల్కిస్ బానో రేపిస్ట్