సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా, సీపీఐ (ఎం.ఎల్) (రెవెల్యూషనరీ ఇనీషియేటివ్), పీసీసీ సీపీఐ (ఎం.ఎల్.) (ప్రోవిజనల్ సెంట్రల్ కమిటీ) పార్టీలు 2024 మార్చి 3,4,5 తేదీల్లో ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న విలీన మహాసభ ద్వారా సీపీఐ (ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ఆవిర్భవించబోతున్నది. ఈ సందర్భంగా నేడు ఖమ్మం మూడు విప్లవ పార్టీలు మాస్ లైన్ గా ఏర్పడ్డ బహిరంగ సభ లో నేతలు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న విప్లవ శక్తులన్నీ ఏకం కావడం కోసం ముందడుగు మాస్ లైన్ పార్టీ వేసిందన్నారు. ఆదివాసీల హక్కులు, స్త్రీల హక్కులు కాపాడటం కోసం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. మోడీ విధానాలను వ్యతిరేఖిస్తున్న కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రులను ఈడీ, సీబీఐ కేసులతో వేధిస్తున్నారని నేతలు వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా..’రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడాలంటే ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది… కమ్యూనిజం పార్టీ అంతరించిపోయిందనే మతతత్వ పార్టీలకు ఈ సభ చెంపపెట్టు…. రాజ్యాంగ వ్యవస్థ ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ…. మోడీ ఓ చక్రవర్తి…. రోజుకి 10 లక్షల సూటు వేసుకునే బీహారీ విహారీ….. కమ్యూనిస్టులను అంతమొందించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు….. పాలస్తీనా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇజ్రాయేలుకు మద్దతు ఇస్తున్నాడు మోడీ…. మణిపూర్ లో మహిళలను వివస్త్ర ను చేస్తే,అక్కడి అల్లర్లను పట్టించుకోవడం లేదు మోడీ…. సోషల్ మీడియా ను వాడుకొని యువతను తప్పుదోవ పట్టిస్తున్నాడు మోడీ…. భారత హిట్లర్ మోడీ….నెత్తురు త్రాగేవారు మోదీ, అమిత్ షా లు…. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే బుల్లెట్ల వర్షం కురిపించారు…. 36 రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వమని అడగడం తప్పా….
రైతు వ్యతిరేఖ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం….. అయోధ్య లో రామాలయం కట్టి,ఓటు రాజకీయం చేస్తున్నాడు…. రామ రాజ్యం అంటే ప్రాణాలు తీసే రాజ్యం కాదు…. బీజేపీ,RSS, ఫాసిసం కు వ్యతిరేఖంగా పోరాడాల్సిన అవసరం ఉంది…. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సకల జనుల పాత్ర ఉంది…. రాజాకారుల పాలన అందించాడు…… నిరంకుశ పాలన విధానం తెచ్చాడు…. మొన్నటి ఎన్నికలు రాజాకారుల పాలనకు చరమ గీతమ్ పాడారు…. మొన్నటి విజయం లో కాంగ్రెస్ గొప్పేమీ లేదు…. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్ ను గెలిపించాయి…. ఇచ్చిన హామీలు అమలు చేయాలి కాంగ్రెస్…. రైతు రుణమాఫీ చేయలేదు,100 రోజులు పూర్తి కావస్తోంది….. ఉద్యమాలకు ప్రజలు సిద్ధం కాబోతున్నారు…. న్యూడెమోక్రసీ సైద్ధాంతికంగా ఫెయిల్ అయ్యారు…. 40 ఏళ్లుగా అంతర్గత పోరాటాలు చేసినం…బయట పడ్డాం… మా విధానం ప్రజా ఉద్యమం…. దేశంలో బలమైన విప్లవ శక్తిని ఏర్పాటు చేయబోతున్నాం….’ అని నేతలు వ్యాఖ్యానించారు.