Site icon NTV Telugu

Chandu Naik Murder: సీపీఐ నాయకుడు చందూ నాయక్ వెలుగులోకి సంచలన విషయాలు..!

Chandu Naik Murder

Chandu Naik Murder

Chandu Naik Murder: మలక్‌పేట్ సీపీఐ నాయకుడు చందూ నాయక్ అలియాస్ చందూ రాథోడ్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర బంధం, ఆర్ధిక లావాదేవీలే కాల్పులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో గుడిసెలు వేయించి అక్కడ వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు తీసుకున్నారని ఆరోపణల కూడా వెలువడుతున్నాయి. మరోవైపు చందు నాయక్‌ను చంపిన గ్యాంగ్‌కి.. చందుకి మధ్య కొన్నాళ్ల నుంచి విభేదాలు ఉన్న నేపథ్యంలోనే హత్య జరిగిందని ఆయన భార్య చెప్పింది. కొన్ని సెటిల్‌మెంట్స్ చేయమని అడిగితే చేయకపోవడం వలన తన భర్తను కిరాతకంగా చంపేశారన్నది ఆమె ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులను అధికారులు గుర్తించారు. ఇప్పటికే యాదగిరి, మున్నా, బాషా అనే అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొంతమంది పరారీలో ఉన్నారు.

Read Also:Real Estate Scam: వెలుగులోకి మరో రియల్ ఎస్టేట్ మోసం.. ఈసారి ఎంతమంది బాధితులంటే..?

వారం రోజులపాటు రెక్కీ చేసి చివరికి శాలివాహన నగర్ పార్కు నుంచి వాకింగ్ చేసి బయటికి వస్తున్న తరుణంలో కాపు కాచి.. కళ్లలో కారం కొట్టి చందు నాయక్ పై కాల్పులు జరిపి చంపేశారు దుండగులు. ఐతే ఈ హత్యకు కొంతకాలంగా కొనసాగుతున్న వ్యక్తిగత విభేదాలే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా రాజేష్ అనే వ్యక్తి చందు రాథోడ్ మధ్య భూముల గట్లపై వివాదాలు సాగుతున్నట్టు ఆధారాలు లభించాయి. ఈ భూమి వివాదాలు కంట్లూర్ పరిధిలో ఉన్నయని తెలుస్తోంది.

Read Also:Nimisha Priya: నిమిష ప్రియను కె.ఎ.పాల్ కాపాడారా..? నిజమేంటి..?

అంతేకాకుండా, వివాహేతర సంబంధం కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఏర్పడిన కలహాలే ఈ హత్యకు దారితీశాయని అంచనా వేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో చందు రాథోడ్‌ను నలుగురు నేరుగా హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. వారితో పాటు మరో ఐదుగురు హత్యకు సహకరించినట్టు తేలింది. ఘటన అనంతరం నిందితులంతా చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీటీవీ ఫుటేజ్‌ ద్వారా గుర్తించారు. ప్రస్తుతం హత్యకు సహకరించిన నలుగురు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురి కోసం 10 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు, మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐతే మర్డర్‌లో రాజకీయ కోణం ఉందా..? అన్న అనుమానాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

Exit mobile version