పగలు, రాత్రి తేడా లేకుండా విచక్షణారహితంగా కస్టమర్లను మద్యం సేవించడానికి మరియు గదులలో ఉండడానికి అనుమతిస్తూ, ఎలాంటి ధృవ పత్రాలు లేకుండా హోటల్ గదులలో ఉండడానికి అనుమతిస్తూ, చట్ట వ్యతిరేక చర్యలను ప్రోత్సహించడము ద్వారా.. పరోక్షముగా స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్న శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ ప్రాంగణాన్ని (బొమ్మరిల్లు కాంప్లెక్స్) సీపీ సుధీర్ బాబు మూసివేతకు ఆదేశించారు. SHO వనస్థలిపురం విజ్ఞప్తి మేరకు సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా శ్రీరస్తు బార్ & రెస్టారెంట్ మరియు హోటల్ రూమ్‌ల ప్రాంగణాన్ని మూసివేశారు.
Read Also: America: సరస్సులో మునిగి భారతీయ యువకుడి మృతి..28 రోజుల తర్వాత మృతదేహం
సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని.. అసాంఘీక కార్యకలాపాలు మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలని కొనసాగించే వారిని.. హోటళ్లు, బార్ & రెస్టారెంట్లు మరియు ఇతరత్ర ప్రాంగణాలలో అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు.
Read Also: Mandipalli Ramprasad Reddy: గత ప్రభుత్వంలో భూ పంపిణీలో భారీగా అక్రమాలు జరిగాయి..