NTV Telugu Site icon

CP CV Anand : మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించిన సీపీ సీవీ ఆనంద్‌

Cv Anand

Cv Anand

CP CV Anand : తెలంగాణ ప్రభుత్వము గురుకులాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, పొలిటికల్ లీడర్లు వసతి గృహాలను సందర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం బాగ్‌లింగంపల్లిలో ఉన్న మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ సందర్శించారు హైదరాబాద్ CP CV ఆనంద్. ఈ సందర్భంగా విద్యార్థులతో వారి సమస్యలు, వారికి ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇస్తున్న బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ విషయమై ప్రిన్సిపల్ తో చర్చించారు సీపీ సీవీ ఆనంద్‌. పిల్లలకు ఏ విధమైన డైట్ ఇస్తున్నారని స్టూడెంట్స్ ను అడిగి తెలుసుకున్నారు. వాణిశ్రీ ప్రిన్సిపాల్ , డాక్టర్ కె. చల్లా దేవి , డిప్యూటి డైరెక్టర్ శోషల్ వేల్ ఫేర్ శాఖ గారు పాఠశాలల్లోని కిచెన్, వాష్ రూమ్, సైన్స్ ల్యాబ్ కంప్యూటర్ ల్యాబ్ ,రోబోటిక్ ల్యాబ్, స్పోర్ట్స్ రూమ్, డార్మిటరీలలను పని తీరు ను పోలీస్ కమిషనర్ కుతెలిపారు. ప్రత్యక్షంగా పోలీస్ కమిషనర్ ఆ విద్యార్థులకు బోధిస్తున్న విధానము గురించి అడిగి తెలుసుకున్నారు , గురుకుల పాఠశాలలో ఉన్న అన్ని అంతస్తులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులతో మాట్లాడుతూ ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని తీసుకోవాలని , క్రీడలు కార్యకలాపాలలో పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహించారు, ఇది ఆరోగ్యకరమైన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో సహాయపడుతుందన్నారు సీపీ ఆనంద్‌. జీవితంలో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంలో , విభిన్న వ్యక్తుల ఆలోచనలతో వ్యవహరించడంలో సహాయపడుతుందన్నారు. సంస్థలోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు విద్య, ఆహారం, క్రీడలు, మౌలిక సదుపాయాలు మెచ్చుకో తగ్గవిగా ఉన్నవన్నారు. అన్ని సాంఘిక , మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు , పాఠశాలల్లో మరింత మంచి పోషకమై నదిగా చేయడానికి , 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో సౌందర్య సాధనాలను అందించడానికి ఏర్పాట్లు చేసినారని తెలిపారు, మీలో కొందరు NEET వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు విద్యార్థులను అభినందించారు . విద్యాసంస్థ ఉపాధ్యాయుల కృషి వల్లనే విద్యార్థులు ఇంతటి గొప్ప విజయాలు సాధించారు అని తెలిపారు . ఈ సంస్థల విద్యార్థులు కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం ప్రయత్నించాలి. ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి, కష్టపడి చదువుకోండని సూచించారు సీవీ ఆనంద్.