Site icon NTV Telugu

CP CV Anand: గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Cv Anand

Cv Anand

దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది పోలీసులతో బందో బస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 20 వేల మంది హైదరాబాద్ పోలీస్ లతో పాటు మరో 9000 మంది ఇతర జిల్లాల నుంచి బందో బస్తుకు వస్తారన్నారు.

Also Read:Abishan Jeevinth: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన యంగ్ ఫిల్మ్‌మేకర్..

మీలాద్ ఉన్ నబీ ర్యాలీ పోస్టుపోన్ చేసుకోవాలని ముస్లిం పెద్దలను కోరామని తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 12 మంది చనిపోయారని తెలిపారు. నిమజ్జనానికి తరలి వచ్చేప్పుడు భక్తులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇటీవల కాలంలో పండుగలకు జనాల తాకిడి పెరిగిందన్నారు. బోనాలకు విపరీతమైన భక్తులు వచ్చారు ఇపుడు వినాయక చవితికి కంటిన్యూ అవుతుందని తెలిపారు. గతేడాది జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు చేపడుతున్నామని వెల్లడించారు.

Also Read:Google Pixel: గూగుల్ పిక్సెల్ ఫోన్ పై క్రేజీ డీల్.. రూ. 10 వేల డిస్కౌంట్..

వారాంతాల్లో ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు తాకిడి పెరిగే అవకాశం ఉందన్నారు. వీఐపీల రాక నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని సూచించారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో సజావుగా జరగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. గతేడాది మాదిరిగానే ఈ ఎడాది సైతం మధ్యాహ్నం వరకు గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తామని తెలిపారు.

Exit mobile version