CP Avinash Mohanty : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అనువల్ రిపోర్ట్ – 2024ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. 37689 కేసులను ఈ ఏడాది రిజిస్టర్ చేశామని తెలిపారు. మొత్తం రిజిస్టర్ అయిన కేసుల్లో 32 శాతం సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితులకు రిఫండ్ చేసి ఇచ్చామని సీపీ మహంతి అన్నారు. ఎకనామిక్ అఫెన్స్ కోసం పీఎస్ ఏర్పాటు చేశాం అందులో కేసులు నమోదయ్యాయని, ఎకనామిక్ అఫెన్సెస్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.. ఎకనామిక్ అఫెన్స్ పీఎస్ ను మరింతగా విస్తరిస్తామన్నారు సీపీ అవినాష్ మహంతి. నార్కోటిక్స్ కట్టడికి పని చేస్తున్నాం.. డ్రగ్స్ కేసులు అనేకంగా నమోదయ్యాయి అదేవిధంగా అరెస్టులు కూడా జరిగాయని, ట్రాఫిక్ విషయంలో పబ్లిక్ ను ఇబ్బంది పెట్టేవి.. రోడ్ ప్రమాదాలకు కారణం అయ్యే అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ఐటీ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమిస్తున్నాం.. రోడ్ వైడనింగ్ చేయడం వల్ల ఇబ్బందులు తప్పుతున్నాయన్నారు.
JPC First Meeting: జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ తొలి సమావేశం..
సైబరాబాద్ ఏరియాలో అనేక ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి.. ఎక్కడ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే అక్కడ కేసు నమోదు చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. 1.50 లక్షల రూపాయల లోపు సైబర్ క్రైమ్ ఉంటే లోకల్ పీఎస్ లోనే ఇన్వెస్టిగేట్ చేస్తారని, జనవరి 1 నుంచి ఇది ప్రారంభం అవుతుందన్నారు. ఇప్పటి వరకు BNS లాస్ కింద 14 వేల కేసులు నమోదు చేశామని, వచ్చే ఏడాది మరింతగా క్రైమ్ తగ్గించడానికి పని చేస్తామన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని, జన్వాడ కేసులో బ్లడ్ శాంపిల్ FSL కు పంపించామన్నారు. దాంట్లో పార్టిసిపెంట్స్ కు నోటీసులు ఇచ్చామన్నారు.
Allu Arjun Silent: విచారణలో వీడియోలు.. నోరు మెదపని అల్లు అర్జున్..