Viral Video: ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఆవు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఆవును హిందూ మతంలో మాతగా పరిగణిస్తారు. పవిత్రమైన విలువను కలిగి ఉంది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉత్తరత్త ప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆవు చేత రెస్టారెంట్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర జంతువు అయిన గోమాత వస్త్రాలతో అలంకరించబడి, పసుపు వస్త్రంతో కప్పబడి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందించే ‘ఆర్గానిక్ ఒయాసిస్’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవులపై ఆధారపడి ఉన్నాయని, అందుకే ఆర్గానిక్ ఒయాసిస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా గోమాతను ఎంచుకున్నానని యజమాని మాజీ డిప్యూటీ ఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు. మాజీ డిప్యూటీ ఎస్పీ శైలేంద్ర సింగ్ యాజమాన్యంలోని ‘ఆర్గానిక్ ఒయాసిస్’ అనే రెస్టారెంట్ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందిస్తుంది.
Read Also: Weather Update: ఏపీలో గురువారం వడగాల్పులు….బయటకు వెళితే అంతే సంగతులు
Also Read
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ఆవు రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఆవు రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు చూడవచ్చు.రెస్టారెంట్ యజమాని శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ”ఆరోగ్యకరమైన శరీరమే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు, మీరు రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించిన ఉత్పత్తుల ఆహారాన్ని పొందుతారు. భారతదేశంలో సొంతంగా ఉత్పత్తి, నియంత్రణ, ప్రాసెసింగ్‌ను కలిగి ఉన్న మొదటి రెస్టారెంట్ ఇదే అని నేను భావిస్తున్నాను. ఇక్కడి భోజనం తిన్న తర్వాత ఆ తేడాను తెలుసుకోవచ్చు.’ అని ఆయన తెలిపారు.
#WATCH | Uttar Pradesh: A restaurant in Lucknow, 'Organic Oasis' that offers food made out of organic farming produce, was inaugurated by a cow. pic.twitter.com/YWcfKqJQcX
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 18, 2023
తాజావార్తలు
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!