NTV Telugu Site icon

Viral Video: ఆర్గానిక్ రెస్టారెంట్‌ను ప్రారంభించిన ఆవు.. వీడియో వైరల్

Cow

Cow

Viral Video: ఆవును హిందూ మతంలో మాతగా పరిగణిస్తారు. పవిత్రమైన విలువను కలిగి ఉంది. దీనిపై మరింత అవగాహన కల్పించేందుకు ఉత్తరత్త ప్రదేశ్‌లోని లక్నోలో ఓ ఆవు చేత రెస్టారెంట్‌ను ప్రారంభించేలా ఏర్పాట్లు చేశారు. పవిత్ర జంతువు అయిన గోమాత వస్త్రాలతో అలంకరించబడి, పసుపు వస్త్రంతో కప్పబడి, సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందించే ‘ఆర్గానిక్ ఒయాసిస్’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆవులపై ఆధారపడి ఉన్నాయని, అందుకే ఆర్గానిక్ ఒయాసిస్‌ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిథిగా గోమాతను ఎంచుకున్నానని యజమాని మాజీ డిప్యూటీ ఎస్పీ శైలేంద్ర సింగ్ తెలిపారు. మాజీ డిప్యూటీ ఎస్పీ శైలేంద్ర సింగ్ యాజమాన్యంలోని ‘ఆర్గానిక్ ఒయాసిస్’ అనే రెస్టారెంట్ సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహారాన్ని అందిస్తుంది.

Read Also: Weather Update: ఏపీలో గురువారం వడగాల్పులు….బయటకు వెళితే అంతే సంగతులు

ఆవు రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కొంతమంది వ్యక్తులతో కలిసి ఆవు రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు చూడవచ్చు.రెస్టారెంట్ యజమాని శైలేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ”ఆరోగ్యకరమైన శరీరమే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రజలు ఇప్పుడు భావిస్తున్నారు. దురదృష్టవశాత్తు, మీరు రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించిన ఉత్పత్తుల ఆహారాన్ని పొందుతారు. భారతదేశంలో సొంతంగా ఉత్పత్తి, నియంత్రణ, ప్రాసెసింగ్‌ను కలిగి ఉన్న మొదటి రెస్టారెంట్ ఇదే అని నేను భావిస్తున్నాను. ఇక్కడి భోజనం తిన్న తర్వాత ఆ తేడాను తెలుసుకోవచ్చు.’ అని ఆయన తెలిపారు.