NTV Telugu Site icon

Cow Attacks Old man: పగబట్టినట్టు వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన ఆవు.. వీడియో వైరల్

Cow Attack

Cow Attack

Cow Attacks Old man in Punjab: ప్రస్తుతం మనుషుల ప్రాణాలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఒకరిపై ఒకరు దాడి చేసి నడిరోడ్డుపై నరక్కుంటున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ మధ్య అడవిని వదిలి క్రూర జంతువులైనా పులి, సింహాలు కూడా జనావాసాల్లోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి. సరే అవి క్రూరజంతువులు దాడి చేయడం వాటి స్వభావం అనుకుంటే ఆఖరి వీధి కుక్కలు కూడా మనుషుల మీద దాడి చేసి చంపేస్తన్నాయి. హైదరాబాద్ లోనే వీధి కుక్కల దాడిలో ఎంతో మంది మరణించారు. అవి ఎంతో మంది మీద దాడి చేసిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక కుక్కలు మాత్రమే కాకుండా సాధు జంతువులైన ఆవులు కూడా దారణంగా, క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. వారిపై దాడి చేసి ప్రాణాలు సైతం తీస్తున్నాయి. ఓ బాలికపై ఆవు దాడి చేసిన వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా కూడా ఆవు ఓ వృద్ధుడిపై దాడి చేసి చంపేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

Also Read: Cheetah-Tortoise Food: చిరుతతో ఫుడ్ పంచుకున్న తాబేలు.. నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్న వీడియో
ఈ దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. మొహాలీలోని పన్‌లో ఓ ఆవు  సరూప్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించింది.  83 ఏళ్ల సరూప్ సింగ్ దానిని బయటకు పంపడానికి ప్రయత్నించాడు. దాంతో ఆవుకు కోపం వచ్చి ఆయనపైనే తిరగబడి దాడి చేసింది. ఆయనను రోడ్డుపై 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లి చంపేసింది. ఆవు నుంచి తప్పించుకోవడానికి  ఆ వ్యక్తి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పెద్దాయనను ఆవు ఈడ్చుకెళుతున్నప్పుడు కొంత మంది దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయిన ఆవు ఆగలేదు. ఏదో పగ ఉన్నట్లే వృద్ధుడి ఈడ్చుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు. సాధు జీవి అయిన ఆవు కూడా ఇలా చేయడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

 

Show comments