NTV Telugu Site icon

Cow Attack: బాలికపై ఆవు దాడి, కాపాడుకోలేక తల్లడిల్లిన తల్లి.. నెట్టింట వీడియో వైరల్

Cow Attack

Cow Attack

Cow Attack: స్కూలు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న బాలికను ఓ ఆవు కొమ్ములతో దాడి చేసింది. రోడ్డుపైనే కొమ్ములతోనే ఆమెను కమ్మేసి నేలపై పడేసింది. ఆ తర్వాత పలుమార్లు బాలికను కొమ్ములతో పొడిచింది. కిందపడిపోయిన ఆ పాప కడుపులో కాళ్లతో తన్నింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని ఇలంగోనగర్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ ఇంటి సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డ్ అయింది. స్థానికులు ఆ ఆవును అదరకొట్టే ప్రయత్నం చేశారు. కానీ, సులువుగా ఆ బాలికను వదిలిపెట్టలేదు.

Also Read: Haryana Violence: ఇప్పటివరకు 393 మంది అరెస్ట్.. నుహ్‌లో ఇంటర్నెట్‌ నిషేధం పొడిగింపు

అసలేం జరిగిందంటే.. ఆ బాలిక గాంధీనగర్‌లో నివసించే ఆయేషా బుధవారం ఉదయం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం తన తల్లి, సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. వారి ముందున్న రెండు ఆవుల్లో ఒకటి వెనక్కి తిరిగి బాలికను కొమ్ములతో ఎత్తిపడేసింది. ఆవు దాడిలో ఆ బాలిక కిందపడిపోయింది. అనంతరం ఆవు వెనక్కి తగ్గకుండా పలుమార్లు బాలికపై దాడి చేసింది. తన కొమ్ములతో పలుమార్లు దాడి చేసింది. ఆ బాలికపై కాళ్లు వేసి దాడి చేసింది. దాంతో ఏం చేయాలో పాలుపోని తల్లి ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేసింది. అరుపులు విని వెంటనే అప్రమత్తమైన స్థానికులు రాళ్లు విసిరి ఆ జంతువును నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా అది వెనక్కి తగ్గలేదు. పలుమార్లు పొడిచిన తర్వాత పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు.

Also Read: Strawberry: స్ట్రాబెర్రీ సాగుతో కోట్లు సంపాదించాడు.. ఎక్కడో తెలుసా?

చిన్నారిపై ఆవుదాడి ఘటనలో ఆ ఆవు యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి జరిమానా విధించారు. ఆవు యజమానిపై నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే కేసు నమోదు చేసినట్లు అరుంబాక్కం పోలీస్ స్టేషన్‌ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీడియోలో కనీసం నాలుగు పశువులు కనిపిస్తున్నాయి. చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని, యజమానికి రూ. 2 వేలు జరిమానా విధించారు. ఇదిలా ఉండగా.. ఆవుల విచ్చలవిడి సంచారంపై చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ జె.రాధాకృష్ణన్ గురువారం మాట్లాడారు. ఆవు దాడి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దాడి చేసిన ఆవును పెరంబూరు షెల్టర్‌కు తరలించామని చెప్పారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ప్రతి జోన్‌లో రోడ్లపై సంచరిస్తున్న ఆవులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.