Site icon NTV Telugu

Mann ki Baat: ఈ ఏడాది చివరి మన్‌ కీ బాత్‌.. ప్రధాని మోదీ ఏం చెప్పారంటే?

Mann Ki Baat

Mann Ki Baat

Mann ki Baat: కోవిడ్-19 వైరస్ చాలా దేశాల్లో విస్తరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఈ ఏడాది చివరి మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజ్‌ చేసుకోవాలని సూచించారు. అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. ముఖ్యంగా చైనాలో జీరో-కోవిడ్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల మహమ్మారి వ్యాప్తికి కారణమైన కేసులు పెరుగుతున్నందున, కేంద్ర ప్రభుత్వం వైరస్‌కు వ్యతిరేకంగా చర్యలను వేగవంతం చేసింది.

Covid BF-7 Variant: బీఎఫ్-7 వేరియంట్ తీవ్రత భారత్‌లో అంతగా ఉండకపోవచ్చు.. ఎందుకంటే?

2022 భారతదేశానికి అనేక విధాలుగా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని ప్రధాని అన్నారు. 2022 చివరి ఎపిసోడ్ కావడంతో ఈ ఏడాది భారత్ సాధించిన మైలురాళ్ల గురించి మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. 220 కోట్లకు పైగా వ్యాక్సినేషన్ డోస్‌లతో భారతదేశం ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దేశం ఐదవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఆయన అన్నారు. అంతరిక్షం, రక్షణ, డ్రోన్ రంగాలలో కొత్త పురోగతిని సాధించింది. క్రీడలలో దేశం సాధించి విజయాలను కూడా హైలైట్ చేశారు. గత కొన్నేళ్లుగా దేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సవాళ్ల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఏ ఏడాదే జీ-20కి భారత్ నాయకత్వం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్రం వేడుకల్లో భాగంగా నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు.

Exit mobile version