Site icon NTV Telugu

Covid-19 EG.5.1: వేగంగా వ్యాప్తి చెందుతోన్న కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌!

Covid 19 Eg.5.1

Covid 19 Eg.5.1

New Covid-19 Variant EG.5.1 is now spreading rapidly in UK: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి కేసులు గత ఏడాదికి పైగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు లేకున్నా.. విదేశాల్లో మళ్లీ పెరుగుతున్నాయి. ఇంగ్లండ్‌లో కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ ‘ఈజీ.5.1’ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొవిడ్‌-19లో ఒమిక్రాన్‌ రకం నుంచి వచ్చిన ఈజీ.5.1 అనే కొత్త వేరియంట్‌ కేసులు బ్రిటన్‌లో ఎక్కువగా నమోదవుతున్నాయట.

ఒమిక్రాన్‌ ఈజీ.5.1 వేరియంట్‌ను తొలుత జులై నెలలో గుర్తించారు. ఇంగ్లండ్‌లో నమోదవుతున్న కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 14.6 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఎరిస్ అనే మారు పేరుతో ఉన్న ఈజీ.5.1 ఏడు కొత్త కోవిడ్-19 కేసులలో ఒకటిగా ఉందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ తెలిపింది.

అంతర్జాతీయంగా కూడా ఒమిక్రాన్‌ ఈజీ.5.1 కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఈ వేరియంట్‌ తీరును గమనిస్తోంది. ప్రజలు టీకాలు వేసుకున్నప్పటికీ, ఇప్పటికే కరోనా బారినపడి కోలుకున్నప్పటికీ ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈజీ.5.1 వేరియంట్‌తో తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ వస్తుందనే సూచనలు ఏమీ లేవని తెలిపింది. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

Also Read: Gold Today Price: మగువలకు శుభవార్త.. నేటి బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే?

Exit mobile version