NTV Telugu Site icon

COVID 19 Cases Rise: నెల రోజుల్లో 80 శాతం పెరిగిన కరోనా కేసులు.. జాగ్రత్త సుమీ!

Coronavirus

Coronavirus

COVID 19 Cases Rise 80 Percent Globally in 28 Days: ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ కేసులు గత ఏడాది కాలంగా ఎక్కువగా నమోదు కాలేదు. భారత్‌లో కూడా ప్రస్తుతం కరోనా కేసులు పెద్దగా లేవు. అయితే కనుమరుగైందనుకున్న కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. కొత్త వేరియంట్ (కొవిడ్‌-19 ఈజీ.5.1)లోకి రూపాంతరం చెందిన మహమ్మారి.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా గత 28 రోజుల్లో దాదాపు 1.5 మిలియన్ కొత్త కేసులు నమోదయ్యాయి.

2023 జూలై 10 నుంచి ఆగస్టు 6 వరకు దాదాపు 1.5 మిలియన్ కొత్త వైరస్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఓ ప్రకటనలో తెలిపింది. అలానే 2,500 మంది మృతి చెందినట్లు వెల్లడించింది. గత 28 రోజులతో పోలిస్తే.. 80% పెరుగుదల నమోదైంది. 6 ఆగస్టు నాటికి ప్రపంచవ్యాప్తంగా 769 మిలియన్లకు పైగా కేసులు, 6.9 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇది 2022లో కరోనా అత్యంత వేగంగా వ్యాప్తి చెందిన కాలం కంటే ఎక్కువ.

Also Read: Air Hostess: శృంగార సేవలు అందిస్తున్న ఎయిర్ హోస్టెస్‌లు.. ఒక రాత్రికి 2.4 లక్షలు!

గత 28 రోజులతో పోలిస్తే.. 57 శాతం కరోనా వైరస్ కేసుల తగ్గుదల మాత్రమే కనబడుతుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి ఆందోళన చెందుతున్నాయి. పశ్చిమ పసిఫిక్ ప్రాంతం కేసుల పెరుగుదలలో ముందంజలో ఉంది. ఇక ఇంగ్లండ్‌లో కొవిడ్‌ 19 కొత్త వేరియంట్‌ ఈజీ.5.1 వేగంగా వ్యాప్తి చెందుతోందని అక్కడి ఆరోగ్యశాఖ అధికారులు ఇటీవల పేర్కొన్నారు. దాంతో అందరూ అలసత్వానికి తావివ్వకుండా అప్రమత్తంగా ఉంటేనే మహమ్మారి నుంచి తప్పించుకోగలం.