NTV Telugu Site icon

DOLO 650: మరోసారి వివాదాల్లో డోలో 650తయారీ కంపెనీ

Dolo 650

Dolo 650

DOLO 650: డోలో 650 ట్యాబెట్లను తయారు చేస్తున్న కంపెనీ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. దీనిపై ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. 30ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దాదాపు రూ.300కోట్ల విలువ చేసే ఆరోగ్య బీమా చెల్లించలేదని పిటీషనీర్ తన పిటీషన్లో పేర్కొన్నారు. కంపెనీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) కుంభకోణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం ట్రయల్ కోర్టులో నమోదు చేయబడింది.

Read Also: UK PM Rishi Sunak : సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ కట్టిన ప్రెసిడెంట్

డోలో-650 తయారీదారులు మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై ఉద్యోగులు ఆరోగ్య బీమా స్కామ్ (ఈఎస్‌ఐ స్కామ్)కు పాల్పడ్డారని ఆరోపించిన తర్వాత ట్రయల్ కోర్టులో కేసు నమోదైంది. న్యాయవాది ప్రదీప్ కుమార్ ద్వివేది దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 20న విచారణకు పోస్ట్ చేసిన జస్టిస్ రాజ్‌బీర్ సింగ్ ముందు సమర్పించారు. గతంతో కూడా డోలో 650కంపెనీ జ్వరంతో బాధపడుతున్న రోగులకు టాబ్లెట్‌ను సూచించిన వైద్యులకు కంపెనీ రూ.1,000 కోట్ల విలువైన బహుమతులను అందించిందని కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఆదాయపు పన్ను శాఖ పరిధిలో ఉంది.

Read Also: Giant Pendulum : జీవితంలో మరోసారి జాయింట్ వీల్ పదం అంటే హడలిపోతారేమో !