దేశంలో మెట్రో ట్రైన్ అనగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది ఢిల్లీ మెట్రోనే.. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో ఢిల్లీ మెట్రో పేరు మారుమోగిపోతుంది. ఎందుకంటే.. ప్రేమికుల అరాచక పనులు, అశ్లీల పనులు ఢిల్లీలో మెట్రోలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. అయితే.. ఈసారి ఓ అశ్లీల ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లిక్ ప్లేస్ లోనే ప్రేమికులు రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేశారు.
Read Also: Pranitha Subhash Yoga Pics: అంతర్జాతీయ యోగా డే.. ప్రణీత సుభాష్ హాట్ యోగా స్టిల్స్!
అయితే ప్రయాణికులంతా మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా.. ఇంతలో ఓ ప్రేమ జంట వచ్చి సీట్లో కూర్చొని రొమాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో చుట్టూ జనాలు వాటిని పట్టించుకోకుండా ఉండిపోయారు. తమను అందరూ చూస్తున్నారన్న భయం లేకుండా ముద్దులు పెట్టుకుంటు.. అశ్లీలంగా ప్రవర్తించారు. వీరు ‘ఏ’ సీన్ దృశ్యాలను ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్న కొందరు తమ ఫోన్‌లలో రికార్డ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు మరోసారి వైద్య పరీక్షలు.. పాదయాత్రకు బ్రేక్..
కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. దీంతో ప్రేమికుల తీరుపై నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ లవర్స్ మితిమీరి ప్రవర్తిస్తున్నారని, ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది.
గతంలో కూడా ఇంతకు మించిన ఘటనలు ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో చాలా చోటు చేసుకున్నాయి. బహిరంగంగా హస్తప్రయోగంతో పాటు, లవర్స్ రొమాన్ చేయడం వంటివి వెలుగులోకి వచ్చాయి.
Read Also: Miheeka Bajaj: మైండ్ బ్లాక్ చేస్తున్న రానా వైఫ్ లేటెస్ట్ ఫొటోస్..
ఇలాంటి వాటిపైన తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తి చేస్తూ ఢిల్లీ మెట్రో అధికారులకు అనేక ఫిర్యాదులు చేశారు. స్పందించిన ఢిల్లీ మెట్రో అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని ఒక ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మెట్రో యజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. అయితే, ఈ వార్నింగ్‌లకు లవర్స్ ఏమాత్రం బెదరడం లేదని తాజా ఘటనను చూస్తే అర్థం అవుతుంది.
Kindly take action ASAP. pic.twitter.com/E0NPg11UUY
— Bhagat S Chingsubam (@Kokchao) June 18, 2023