NTV Telugu Site icon

Shocking Incident : ఛీ వీళ్లు పేరెంట్సా.. బిడ్డకు విమాన టిక్కెట్ కొనాల్సి వస్తుందని..

Couple Leaves Baby

Couple Leaves Baby

Shocking Incident : సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా బిడ్డను కాసేపు కూడా చూడకుండా ఉండలేరు. కానీ ఇజ్రాయెల్‌ లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విమాన టికెట్ కొనాల్సి వస్తుందని ఓ జంట తమ బిడ్డను ఎయిర్ పోర్టులోనే వదిలి వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెంటనే అప్రమత్తం అవ్వడంతో వారి ప్రయత్నాన్ని నిరోధించారు. బెల్జియన్‌ పాస్‌పోర్టులను కలిగి ఉన్న ఈ జంట.. బిడ్డతో కలిసి బ్రస్సెల్స్‌కు వెళ్లేందుకు టెల్‌ అవీవ్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు తెలుస్తున్నది. టెర్మినల్ కౌంటర్‌ 1 వద్దకు రాగానే వారి బిడ్డకు కూడా టికెట్‌ కొనుగోలు చెప్పడంతో ఇలాంటి షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారని ర్యాన్‌ ఎయిర్‌ కౌంటర్‌ మేనేజర్‌ చెప్పారు. ఇలాంటి ఘటనను తామెన్నడూ చూడలేదని అక్కడి సిబ్బంది అంటున్నారు. చెక్‌-ఇన్‌ కౌంటర్‌ వద్ద బిడ్డను వదిలి వెళ్లిపోయేందుకు యత్నించిన జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: Intel : ఉద్యోగాలుంటాయ్.. కానీ జీతాలు తగ్గిస్తాం.. ఇక మీ ఇష్టం

ఇజ్రాయెల్ నుండి ర్యాన్‌ఎయిర్ విమానంలో బ్రస్సెల్స్‌కు వెళ్లడానికి దంపతులు వచ్చారు. తమ ఏడాది వయసున్న మగబిడ్డకు టిక్కెట్‌ కొనలేదు. పిల్లలతో ప్రయాణించే వ్యక్తులు ల్యాప్ సీటు కోసం సుమారు 25 డాలర్లు చెల్లించాలి. లేదా ర్యాన్‌ఎయిర్ ప్రామాణిక ఛార్జీల ప్రకారం ప్రత్యేక సీటును కొనుగోలు చేయాలి. విమానాశ్రయానికి ఆలస్యంగా వచ్చారు. అప్పటికే చెక్-ఇన్ కౌంటర్లు మూసేశారు. అక్కడ సిబ్బంది వారిని ఆపి టికెట్ లు అడిగారు. అయితే, వారు రెండు టికెట్లే చూపించారు. శిశువుకు టికెట్ కొనలేదు. భద్రత సిబ్బంది ఆ చిన్నారి టికెట్ గురించి అడగగా.. క్యారియర్‌లో శిశువును వదిలి వెళ్లడానికి ప్రయత్నించారు. ఇది చూసి భద్రతా సిబ్బంది అలర్ట్ చేయడంతో.. సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకున్నారు. ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్ లో చోటు చేసుకుంది. విషయం తెలిసినవారంతా షాక్ కు గురవుతున్నారు.

Read Also: KTR: సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి