Suicide: ఏం కష్టమచ్చిందో.. ఢిల్లీలో వేర్వేరు చోట్ల దంపతుల ఆత్మహత్య
- ఢిల్లీలో ఓ దపంతుల జంట వేర్వేరు చోట్ల ఆత్మహత్య
- మృతులు అస్సాంకు చెందినవారిగా గుర్తింపు
- భార్య జుమీ దాస్.. భర్త భాస్కర్ దేకాగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఓ దపంతుల జంట వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు శనివారం సమాచారం అందించారు. జుమీ దాస్, ఆమె భర్త భాస్కర్ దేకా (27)గా పోలీసులు తెలిపారు. కాగా.. ఝుమీ దాస్ హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేసింది. భర్త చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓమాక్స్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాడు.
Read Also: Heatwave warning: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
వివరాల్లోకి వెళ్తే.. యమునా ఖాదర్‌లోని నీటి పైప్‌లైన్ క్రింద భార్య జుమీ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ వేలాడుతూ కనిపించిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. తన భర్త భాస్కర్ దేకా మృతదేహాన్ని వారి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత
కాగా.. ఆత్మహత్యకు ముందు జుమీ దాస్ తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. అతను లేనిది నేనుండ లేనని తనతో చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. భర్త భాస్కర్ డేకా సూసైడ్ నోట్ రాశాడు. అది అస్సామీ భాషలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ లెటర్ లో అతను తన భార్యపై తనకున్న ప్రేమను తెలిపాడని, ఆమెను అస్సాం నుండి ఢిల్లీకి తీసుకురావాలనే నిర్ణయం తప్పు అని రాసుంది. లేఖలో మృతుడు భాస్కర్ క్షమాపణలు చెప్పాడు. కాగా.. ఈ విషయం గురించి పోలీసులు అసోంలో ఉన్న దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!