Site icon NTV Telugu

Suicide: ఏం కష్టమచ్చిందో.. ఢిల్లీలో వేర్వేరు చోట్ల దంపతుల ఆత్మహత్య

Sucide

Sucide

ఢిల్లీలో ఓ దపంతుల జంట వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంకు చెందినవారిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు శనివారం సమాచారం అందించారు. జుమీ దాస్, ఆమె భర్త భాస్కర్ దేకా (27)గా పోలీసులు తెలిపారు. కాగా.. ఝుమీ దాస్ హౌస్ కీపింగ్ సిబ్బందిగా పనిచేసింది. భర్త చాందినీ చౌక్ ప్రాంతంలోని ఓమాక్స్ మాల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వాడు.

Read Also: Heatwave warning: పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ

వివరాల్లోకి వెళ్తే.. యమునా ఖాదర్‌లోని నీటి పైప్‌లైన్ క్రింద భార్య జుమీ మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ వేలాడుతూ కనిపించిందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. తన భర్త భాస్కర్ దేకా మృతదేహాన్ని వారి ఇంటి నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత

కాగా.. ఆత్మహత్యకు ముందు జుమీ దాస్ తన స్నేహితురాలికి ఫోన్ చేసింది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని.. అతను లేనిది నేనుండ లేనని తనతో చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. భర్త భాస్కర్ డేకా సూసైడ్ నోట్ రాశాడు. అది అస్సామీ భాషలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ లెటర్ లో అతను తన భార్యపై తనకున్న ప్రేమను తెలిపాడని, ఆమెను అస్సాం నుండి ఢిల్లీకి తీసుకురావాలనే నిర్ణయం తప్పు అని రాసుంది. లేఖలో మృతుడు భాస్కర్ క్షమాపణలు చెప్పాడు. కాగా.. ఈ విషయం గురించి పోలీసులు అసోంలో ఉన్న దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

Exit mobile version