Site icon NTV Telugu

Medchal Murder: చెత్త గొడవ.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు..

Delhimurder

Delhimurder

భార్యాభర్తలు కలిసి వ్యక్తిని హత్య చేసిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ చెందిన ఎదునూరి నరసింహా అలియాస్ చిన్న (32) తన భార్య అనిత(30) తో కలిసి మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ లో నివాసం ఉంటున్నారు. వృత్తిరీత్యా కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన నర్సింలు (37) శనివారం మధ్యాహ్నం మేడ్చల్ చెక్పోస్ట్ లోని వెంకటరమణ లిక్కర్ ల్యాండ్ లో మద్యం సేవిస్తున్నాడు. అక్కడ నరసింహా అలియాస్ చిన్న తన భార్య అనితతో కలిసి స్క్రాప్ విషయంలో గొడవ జరిగింది. దీంతో చిన్న అనిత కలిసి నరసింహులు కర్రలతో దారుణంగా కొట్టారు. తీవ్ర గాయాలై మృతి చెందాడు. స్థానికంగా ఉన్న వైన్ షాప్ క్యాషియర్ మహేష్ రాత్రి 8 గంటలకు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. భార్యాభర్తను మేడ్చల్ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

READ MORE: BHEL: జాబ్ సెర్చ్ లో ఉన్నారా?.. 10th అర్హతతో భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో 515 జాబ్స్ రెడీ.. మంచి జీతం

Exit mobile version