Site icon NTV Telugu

Nitin Gadkari: దేశం ఆయనకు రుణపడి ఉంది.. మన్మోహన్ సింగ్‌పై నితిన్ గడ్కరీ ప్రశంసల జల్లు

Nitin Gadkari

Nitin Gadkari

Nitin Gadkari: ఆర్థిక సంస్కరణలకు దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం అన్నారు. పేద ప్రజలకు దాని ప్రయోజనాలను అందించాలనే ఉద్దేశంతో భారతదేశానికి ఉదారవాద ఆర్థిక విధానం అవసరం అని గడ్కరీ టీఐఓఎల్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. 1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్‌ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికిన భారతదేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయని ఆయన అన్నారు. సరళీకరణతో కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్‌కు దేశం రుణపడి ఉందని గడ్కరీ అన్నారు. మాజీ ప్రధాని ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్ల 1990వ దశకం మధ్యలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్రలో రోడ్లు నిర్మించడానికి డబ్బు సేకరించగలిగానని ఆయన గుర్తు చేసుకున్నారు.

Justice Chandrachud: సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా నేడు జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రమాణం

ఉదారవాద ఆర్థిక విధానం రైతులు, పేద ప్రజల కోసం అని గడ్కరీ నొక్కి చెప్పారు. ‘టాక్స్‌ఇండియా ఆన్‌లైన్‌’ అనే పోర్టల్‌ ఈ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందనడానికి చైనా మంచి ఉదాహరణ అని కూడా ఆయన అన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్‌కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరమని ఆయన అన్నారు. రహదారుల నిర్మాణం కోసం ఎన్‌హెచ్‌ఏఐ సామాన్యుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తోందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి తెలిపారు. రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖ 26 గ్రీన్ ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తోందని, తనకు డబ్బు కొరత లేదని గడ్కరీ చెప్పారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. టోల్ ఆదాయం ప్రస్తుతం సంవత్సరానికి రూ.40,000 కోట్ల నుంచి 2024 చివరి నాటికి రూ.1.40 లక్షల కోట్లకు పెరుగుతుంది.

Exit mobile version