Site icon NTV Telugu

Fake Notes: సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్ల చలామణి.. లబోదిబో మంటున్న గ్రామస్థులు

Fake Notes

Fake Notes

ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొందరు కేటుగాళ్లు నకిలీ నోట్ల ప్రింటింగ్ కు పాల్పడుతున్నారు. దొంగనోట్లను ముద్రించి గుట్టుచప్పుడు కాకుండా చలామణిలోకి తీసుకొస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్ పూర్ లో దొంగ నోట్లు కలకలం రేపాయి. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్ల చలామణి అయినట్లు అధికారులు గుర్తించారు. కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ కట్టడానికి వెళ్లిన జలాల్ పూర్ గ్రామానికి చెందిన రైతు చిన్న సాయిలు వద్ద రూ.2 లక్షల 8వేల 500 దొంగ నోట్లు ఉన్నట్లు గుర్తించారు.

నకిలీ నోట్లను గుర్తించి పోలీసులకు పిర్యాదు చేశారు బ్యాంకు అధికారులు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. 417 రూ.500 నోట్లు నకిలీగా పోలీసులు తేల్చారు. కాగా ఇవే నోట్లను ఓ అభ్యర్థి సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు తేలడంతో గ్రామస్థులు లబోదిబో మంటున్నారు. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారిలో గుబులు మొదలైంది. స్థానిక ఎన్నికల్లో దొంగనోట్లు చలామణి కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version